వనపర్తిటౌన్: జిల్లాలోని 25 పరీక్ష కేంద్రాల్లో సోమవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలకు 262 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 6,924 మందికి గాను, 6,662 మంది హాజరయ్యారు. ఇందులో జనరల్ విద్యార్థులు 5,613 మందికి గాను 5,400 మంది, ఒకేషనల్ విభాగంలో 1,311 మందికి గాను1,262 మంది విద్యార్థులు హాజరై పరీక్షలు రాసినట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. పరీక్ష కేంద్రాలను డీఐఈఓతో పాటు డీఈసీ మెంబర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్స్ తనిఖీ చేశారు.
నిందితులను
కఠినంగా శిక్షించాలి
వనపర్తి రూరల్: నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర ఘటనలో రెండు నెలల చిన్నారి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్‌ఎన్ రమేశ్, కార్యదర్శి ఎం.రాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమ్మెరగట్టు మల్లన్న దర్శనం కోసం వెళ్లిన కుటుంబంపై కొందరు అగ్రకుల దురహంకారంతో దాడి చేయడం అమానుషమన్నారు. నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బొబ్బిలి నిక్సన్, బి.కవిత, కుర్మయ్య, గంధం రత్నయ్య, ఆంజనేయులు, డి.కుర్మయ్య, గట్టయ్య, అరుణ, సంధ్య పాల్గొన్నారు.
17, 18నయూనివర్సిటీల కన్వెన్షన్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఈనెల 17, 18న పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర స్థాయి యూనివర్సిటీల కన్వెన్షన్ పోస్టర్‌ను పీయూ వీసీ శ్రీనివాస్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ యూనివర్సిటీ కన్వెన్షన్‌కు పీయూ వేదిక కావడం గొప్ప విషయం అన్నారు. విద్యార్థులు, యూనివర్సిటీలకు మేలు జరిగే విధంగా చర్చలు జరుగుతాయని, విద్యార్థుల హక్కులు, అందరికీ నాణ్యమైన విద్య అందించేందుకు సంఘాలు కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో పీయూ రిజిస్ట్రర్ రమేష్‌బాబు, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు జేపీఎన్‌సీ రవికుమార్, మధుసూదన్‌రెడ్డి, బెక్కం జనార్దన్, అధ్యక్ష, కార్యదర్శులు రాము, రాజేష్, భరత్, శేఖర్, సాయి తదితరులు పాల్గొన్నారు.


