వనపర్తి రూరల్: క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేసే ప్రతి నాయకుడు, కార్యకర్తకు సముచిత స్థానం ఉంటుందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. సోమవారం పెబ్బేరు, శ్రీరంగాపురం మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన సమావేశాలకు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డితో కలిసి ఆయన హాజరై మాట్లాడారు. గతంలో ఉన్న మండల కమిటీలకు, ప్రస్తుతం కొత్తగా ఎన్నుకునే కమిటీలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందన్నారు. ఒక్కొక్క కమిటీలో 21 మంది ఉంటారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లడంతో పాటు సంస్థాగత, గ్రామ, బూత్ కమిటీల్లో మండల బాధ్యులు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. పార్టీకి నిబద్దతగా పనిచేసే వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అనంతరం ఆశావహుల పేర్లను నమోదు చేసుకున్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గౌని ప్రమోదిని, బండారు శ్రీనివాస్‌గౌడ్, వైస్‌చైర్మన్ సుమిత్ర, విజయవర్ధన్‌రెడ్డి, పీసీసీ జరనల్ సెక్రెటరీ నందిమల్ల యాదయ్య, రాజేంద్రప్రసాద్ యాదవ్, కదిరె రాములు, శ్రీలతారెడ్డి ఉన్నారు.


