ఈ కాల్వ యమడేంజర్‌! | - | Sakshi
Sakshi News home page

ఈ కాల్వ యమడేంజర్‌!

Mar 11 2026 8:53 AM | Updated on Mar 11 2026 8:53 AM

ప్రాణాలను హరిస్తున్న జూరాల ఎడమ కాల్వ

వారాబందితో

కానరాని నీటి ప్రవాహం

స్నానానికి, బట్టలు ఉతికేందుకు వెళ్లి గల్లంతు.. మృత్యువాత

అవగాహన కల్పించడంలో విఫలమవుతున్న అధికారులు

నీటి ప్రవాహాన్ని

తెలియజేయాలి..

జూరాల ఎడమ కాల్వలో నీటి ప్రవాహ ఉధృతిని ప్రాజెక్టు అధికారులు సిబ్బంది ద్వారా సమీపంలోని గ్రామాల ప్రజలకు తెలియజేయాలి. వారాబంది ద్వారా ఎన్ని రోజులు నీటిని అధికంగా వదులుతారు.. ఎన్ని రోజులు నీటిని నిలిపివేస్తారనే విషయాలను అక్కడి రైతులతో పాటు ప్రజలకు వివరిస్తే ప్రాణ హానిని నివారించవచ్చు.

– హన్మంతు, మాజీ ఎంపీటీసీ, నందిమళ్ల

రక్షణ కంచె ఏర్పాటు చేయాలి..

గుంటిపల్లి క్రాస్‌రోడ్డు సమీపంలోని జూరాల కాల్వ వద్ద తరచుగా ప్రజ లు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. నీటి ప్రవాహంపై అవగాహన లేక ఎంతో మంది కాల్వలో కొట్టుకుపోయి మృతిచెందడం విచారకరం. మరోమారు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రాజెక్టు అధికారులు కాల్వ వెంట ఉన్న మెట్ల వద్ద రక్షణ కంచె ఏర్పాటుచేయాలి.

– వెంకటేశ్‌, నందిమళ్ల

అవగాహన కల్పిస్తున్నాం..

జూరాల ప్రాజెక్టు నుంచి రామన్‌పాడ్‌ రిజర్వాయర్‌ వరకు ఉన్న ప్రధాన ఎడమ కాల్వ వెంట నీటి ప్రవాహం అధికంగా ఉంటుంది. వారబందితో సంబంధం లేకుండా కాల్వకు నీటిని నిరంతరం అందిస్తుంటారు. వారబంది రోజుల్లో నీటి ప్రవాహం తక్కువగా ఉంటుందని సమీప ప్రాంతాల యువకులు, చిన్నారులు ఈత కోసం కాల్వను ఆశ్రయిస్తుంటారు. కాల్వలోని నాచు అధికంగా ఉండటంతో కాలుజారి కాల్వలో గల్లంతై ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. దీనిపై ఆయా గ్రామాల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

– శివకుమార్‌, సీఐ, ఆత్మకూరు

అమరచింత: జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ప్రమాదకరంగా మారింది. కాల్వలో నీటి ఉధృతిని పసిగట్టలేని రైతులు, ప్రజలు నీటిలో దిగి గల్లంతు కావడం.. విలువైన ప్రాణాలను పోగొట్టుకోవడం వంటి ఘటనలు సర్వసాధారణంగా మారాయి. జూరాల ఎడమ కాల్వ ఏర్పాటుచేసి నేటికీ 24 ఏళ్లు గడుస్తున్నా కాల్వ సమీపంలోని గ్రామాల ప్రజలకు చాలా వరకు నీటి ప్రవాహ ఉధృతి తెలియకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే చిన్నారులు, యువత ఈత సరదాతో కాల్వలోకి దిగి ప్రాణాలను కోల్పోతున్నారు. జూరాల ప్రాజెక్టు సమీపంలోని నందిమళ్ల గ్రామంలో ఈ ఘటనలు అధికంగా చోటు చేసుకోన్నాయి. అయితే ప్రాజెక్టు అధికారుల రక్షణ చర్యలు మాత్రం శూన్యంగా మారాయి.

రామన్‌పాడు వరకు ప్రమాదమే..

జూరాల ఎడమ కాల్వ ద్వారా ఆయకట్టుకు సాగునీటితో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు తాగునీటిని అందించే రామన్‌పాడ్‌ ప్రాజెక్టుకు ఇక్కడి నుంచే విడుదల చేస్తుంటారు. ప్రాజెక్టు నుంచి రామన్‌పాడ్‌ వరకు సుమారు 17 కిలోమీటర్ల మేర కాల్వ ప్రవహిస్తోంది. రామన్‌పాడ్‌ రిజర్వాయర్‌ వరకు ఉన్న సమీప గ్రామాల వద్ద దాదాపు 10 చోట్ల కాల్వలో దిగుడు మెట్లు ఏర్పాటుచేశారు. దీంతో నందిమళ్ల, మూలమళ్ల, జూరాల తదితర గ్రామాల ప్రజలు నిత్యం కాల్వలో దిగుతూ.. తమతమ అవసరాలను తీర్చుకుంటుంటారు. ఈ క్రమంలోనే పలువురు కాల్వలో కొట్టుకుపోవడం.. రామన్‌పాడ్‌ రిజర్వాయర్‌లో మృతదేహాలు లభించడం సర్వసాధారణంగా మారింది. ఐదేళ్లుగా జూరాల కాల్వలకు ప్రతి సీజన్‌లో వారాబందితో నీటిని వదులుతున్న విషయం రైతులకు తప్ప ఇతరులకు తెలియకపోవడమే ప్రధాన కారణమని పలువురు అంటున్నారు. జూరాల గ్రామ సమీపంలో వెళ్తున్న ప్రధాన ఎడమ కాల్వ లోతుగా, భయంకరంగా ఉండటంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.

జూరాల ప్రాజెక్టు ఎడమ కాల్వ సమీపంలో ఉన్న నందిమళ్ల గ్రామంలోనే 11 ఏళ్ల కాలంలో 17 మంది గల్లంతై మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన బండి పెద్ద హన్మంతు, కోళ్ల రంగన్న, మాల రాజు, చింతలమ్మ, బోయ చెన్నమ్మ, బోయ బొజ్జన్న, తెలుగు కాశీమన్న, చిన్నరాయుడు, రాజ్మీ బేగం, మహిమూద్‌, కుర్వ మణెమ్మ, అలుక్కోడి సరిత తదితరులు గల్లంతై మృతిచెందారు. గత నెలలో ఈత పడేందుకు వెళ్లి చిన్నారి ఆరిఫ్‌ గల్లంతయ్యాడు. అదే విధంగా మూడేళ్ల క్రితం పెబ్బేరు సమీపంలోని కాల్వలో ముగ్గురు, ఆత్మకూర్‌ సమీపంలోని గుంటిపల్లి వద్ద 8మంది గల్లంతు కాగా.. గతేడాది మరో ఇద్దరు కాల్వలో గల్లంతై మృతిచెందారు.

ఒక్క గ్రామంలోనే

17 మంది మృత్యువాత..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement