పోలీస్‌ ప్రజావాణికి 20 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ ప్రజావాణికి 20 ఫిర్యాదులు

Mar 11 2026 8:53 AM | Updated on Mar 11 2026 8:53 AM

వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 20 ఫిర్యాదులు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతో ఎస్పీ సునీతారెడ్డి నేరుగా సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు సిఫారస్‌ చేశారు. భూ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా 10 దాఖలు కాగా.. పరస్పర గొడవలకు సంబంధించి 9, భార్యాభర్తల తగాదాపై ఒక ఫిర్యాదు అందినట్లు తెలిపారు.

సదరం సర్టిఫికెట్స్‌కు దరఖాస్తు చేసుకోండి

కందనూలు: జిల్లాలో దివ్యాంగులు సదరం సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఆర్‌డీఓ చిన్న ఓబులేషు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026 సంవత్సరానికి రెన్యూవల్‌, రెగ్యులర్‌ సర్టిఫికెట్స్‌ కోసం యూడీఐడీ పోర్టల్‌, మీసేవలో గాని దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం ఫోన్‌కు మెసేజ్‌ వచ్చిన తర్వాత ఈ నెల 6, 10, 13, 17, 20, 24, 31 తేదీలలో శారీరక, మస్క్యులర్‌, సీఎన్‌ఎస్‌, సెరెబ్రల్‌, పార్కన్సన్‌ దివ్యాంగులు ఉదయం 10 గంటలకు నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకోవాలని తెలిపారు. అలాగే వినికిడి, మూగలోపం గల దివ్యాంగులు ఈ నెల 5, 25 తేదీల్లో, కంటిచూపు లోపం గలవారు ఈ నెల 9, 24 తేదీల్లో, మానసిక దివ్యాంగులు ఈ నెల 11, 18 తేదీల్లో, తలసేమియా, హెమోపిలియా, స్కేరోసిస్‌ దివ్యాంగులు ఈ నెల 30న జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి ఉదయం 10 గంటలకు చేరుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement