అమరచింత: ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి కోరారు. మంగళవారం పార్టీ పట్టణ అధ్యక్షురాలు లావణ్య ఇంట్లో నిర్వహించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. పాలమూరు పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. క్రికెట్, కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, పరుగుపందెం పోటీలు ఉంటాయని.. ప్రతిభ కనబర్చిన వారిని పార్లమెంట్‌స్థాయి పోటీలకు ఎంపికచేసి నగదు బహుమతితో పాటు జ్ఞాపికలు అందజేయనున్నట్లు వెల్లడించారు. పోటీలను రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నామని.. క్రీడాకారులు 24వ తేదీ వరకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చే నెల 9 నుంచి 24వ తేదీ వరకు క్రీడాపోటీల నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ గ్రామీణ అధ్యక్షుడు, కిష్టంపల్లి సర్పంచ్ మల్లారెడ్డి, నరాల నారాయణ, చంద్రనాయక్‌తండా సర్పంచ్ కృష్ణానాయక్, కౌన్సిలర్లు మేర్వ రాజు, విష్ణు, ఊషన్న, పసుల నీరజ్, దుబాయ్ వెంకటేశ్వర్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, గణేష్ పాల్గొన్నారు.


