వనపర్తి: ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా 12వ తేదీన నిర్వహించే సర్పంచులు, పుర కౌన్సిలర్ల శిక్షణను విజయవంతం చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యానాయక్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కె.రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించగా.. జిల్లా నుంచి అదనపు కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని కళ్యాణ్‌సాయి ఫంక్షన్‌హాల్‌లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు శిక్షణ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రజాప్రతినిధులు అందరికీ ఆహ్వానం పంపించినట్లు తెలిపారు. కొత్తగా ఎన్నికై న పుర కౌన్సిలర్లకు గుర్తింపు కార్డులు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు వివరించారు. శిక్షణకు హాజరయ్యే ప్రజాప్రతినిధులకు మధ్యాహ్న భోజనం సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొదటి థీమ్ అయిన పరిశుభ్రత, రికార్డుల క్లియరెనన్స్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఎస్పీ బాలాజీనాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్


