వనపర్తిటౌన్: హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 12న ‘విద్యుత్ బస్సులు ఆర్టీసీ.. ప్రజలపై ప్రభావం’ అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నామని, కార్మికులు అధికసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డౠ్ల్య (సీఐటీయూ) జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ ఖయ్యూం, డిపో కార్యదర్శి సి.నాగేశ్వర్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని డిపో ఎదుట సదస్సుకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం విద్యుత్ బస్సులు వినియోగించాలని నిర్ణయించిందని, దీంతో కార్మికులు ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ, ప్రచార కార్యదర్శి గోవర్ధన్, సహాయ కార్యదర్శి నారాయణ, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


