స్వచ్ఛతే ఉత్తమ సేవ | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతే ఉత్తమ సేవ

Mar 9 2026 7:48 AM | Updated on Mar 9 2026 7:48 AM

వనపర్తిటౌన్‌: స్వామి వివేకానంద చెప్పినట్లు ఉత్తమ సేవ అంటే స్వచ్ఛతేనని.. చెత్త రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దుదామని హైదరాబాద్‌ రీజినల్‌ డైరెక్టర్‌ కం అప్పిలేట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి కోరారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆదివారం జిల్లాకేంద్రంలోని కేడీఆర్‌ పార్క్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎం.మాధవి అధ్యక్షతన ఇంటింటి చెత్త సేకరణపై ప్రజలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. నేటి చిన్న మార్పులే భవిష్యత్‌కు బంగారు బాటలు అవుతాయని, తడి, పొడి చెత్తను పురపాలిక అందజేసిన వేర్వేరు పాస్టిక్‌ బుట్టల్లో వేసి చెత్త సేకరణ వాహనాలకు అందించాలన్నారు. చెత్త ఇంటి బయట వేయడమంటే మన ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని మనమే దెబ్బ తీసుకున్నట్లని, పట్టణాన్ని గ్రీన్‌ జోన్‌గా తీర్చిదిద్దేందుకు పట్టణవాసులంతా సహకరించాలని కోరారు. ఇంటితో పాటు కాలనీని సైతం శుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని గుర్తు చేశారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వార్డు మహిళలు, మహిళా సంఘ సభ్యులను ఆయన సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్‌ డైరెక్టర్‌ నారాయణరావు, పుర కమిషనర్‌ ఎన్‌.వెంకటేశ్వర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఉమామహేశ్వర్‌రెడ్డి, మెప్మా అధికారులు బాలరాజు, యువరాజు, సరస్వతి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement