షీటీం నంబర్ : 63039 23211
ఫ్యామిలీతోనే ‘ఇంతి’ంతై..
ఆమెకు ఆపదొస్తే..
ఆదివారం శ్రీ 8 శ్రీ మార్చి శ్రీ 2026
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఆధునిక కాలంలో మహిళలు.. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కాలం మారుతున్న కొద్దీ వారి కట్టుబాట్లు మారాయి. ప్రధానంగా యువతుల ఆలోచన ధోరణిలో మార్పులు చోటుచేసుకున్నాయి. విద్య, ఉద్యోగాలు, జీవనంలో ఎక్కువ శాతం మంది స్వతంత్ర (ఇండిపెండెంట్) భావజాలాన్ని కనబరుస్తున్నారు. అయితే కుటుంబ సహకారమే తమకు ముఖ్యమని.. తమ నిర్ణయాలకు తల్లిదండ్రుల మద్దతు అవసరమని స్పష్టం చేస్తున్నారు. వారి కష్టాలు, శ్రమ ఫలితంగానే తాము ఈ స్థాయికి చేరామని.. అయితే తాము స్వతంత్రంగా జీవించేలా తమ నిర్ణయాలను గౌరవించే వైఖరికి సంబంధించి కుటుంబసభ్యుల్లో మరింత మార్పు అవసరమని పలువురు ఆకాంక్షిస్తున్నారు. ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యనభ్యసిస్తున్న 18 నుంచి 25 ఏళ్ల యువతుల మనోగతంపై ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. ఇందులో వెల్లడైన అంశాలు మీకోసం..
సర్వే సాగిందిలా..
ఉమ్మడి పాలమూరులో నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కో జిల్లా నుంచి 20 మంది చొప్పున యువతుల అభిప్రాయాలను ‘సాక్షి’ బృందం సేకరించింది. ఆయా జిల్లా కేంద్రాలు, పలు మున్సిపాలిటీల మున్సిపాలిటీల పరిధిలో మొత్తంగా 100 శాంపిళ్లు తీసుకుంది.
● రోజువారి నిర్ణయాల్లో ఎంత మేర స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు అనే ప్రశ్నకు ఒక్కో జిల్లాలో ఒక్కోరకమైన సమాధానం వచ్చింది. వంద మంది మహిళల్లో 25 మంది మాత్రమే పూర్తిస్థాయిలో స్వతంత్ర నిర్ణయాలతో ముందుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఇదే క్రమంలో మీరు నిర్ణయాలకు మీ ఇంట్లో ఎంత మేర మద్దతు లభిస్తోంది అనే దానికి కొద్ది మేర మాత్రమే అని 58 మంది సమాధానం ఇచ్చారు.
ఒక సీ్త్ర ఇండిపెండెంట్‌గా ముందుకు వెళ్లాలంటే ఎవరి సహకారం ఎక్కువ అవసరం?
86
6
8
కుటుంబం
మీరు చదువుతున్న కోర్సునుమీరు కావాలనే ఎంచుకున్నారా?
మీరు తీసుకునే రోజు వారి నిర్ణయాల్లో ఎంత మేరకు స్వతంత్రంగా వ్యవహరించగలుగుతున్నారు?
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
వనపర్తి రూరల్: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ అన్నారు. శనివారం పెబ్బేరు పుర కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్‌గౌడ్, కమిషనర్ ఖాజా ఆరీఫుద్దీన్‌తో కలిసి ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల ముంగిటకే పాలనను తీసుకురావడమే ప్రజాపాలన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. మున్సిపాలిటీలోని ప్రతి వార్డులో షెడ్యూల్ ప్రకారం దరఖాస్తులు స్వీకరిస్తామని.. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ప్రజలు సమర్పించిన దరఖాస్తులను అత్యంత పారదర్శకంగా పరిశీలిస్తామని చెప్పారు. పుర చైర్మన్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్నుత్న ఈ కార్యక్రమాన్ని పుర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ సుమిత్ర ఎల్లారెడ్డి, మార్కెట్ చైర్మన్ ప్రమోదిని, వైస్ చైర్మన్ ఎద్దుల విజయవర్దన్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
యూరియా కొరత
సృష్టించొద్దు : డీఏఓ
అమరచింత: రైతులకు సకాలంలో యూరియా అందించేందుకు దుకాణాల్లో నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలని.. కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆంజనేయులు హెచ్చరించారు. శనివారం మండల కేంద్రంలోని హాకా ఫర్టిలైజర్ సెంటర్‌తో పాటు ఇతర దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత సీజన్‌లో యూరియా అనుకున్నంత మేర సరఫరా కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వచ్చిన యూరియాను సకాలంలో సరఫరా చేసినా.. రైతులు దొరకదనే ఉద్దేశంతో ఎక్కువ తీసుకెళ్లడంతో సమస్య తలెత్త్తిందని చెప్పారు. కొరతను నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించిందని.. ప్రతి రైతు తన స్మార్ట్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఇంటి నుంచే బుక్ చేసుకోవచ్చని తెలిపారు. యాప్ వినియోగంపై రైతులకు వ్యవసాయశాఖ సిబ్బంది అవగాహన కల్పించారని చెప్పారు. రైతులకు సకాలంలో యూరియా అందించలేని డీలర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ అరవింద్, ఏఈఓలు ఉన్నారు.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
బిజినేపల్లి: వట్టెం శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం ముగిశాయి. ఆలయ ప్రధాన అర్చకులు సముద్రాల శ్రీమన్నారాయణచార్యుల ఆధ్వర్యంలో ఉత్స వమూర్తులకు పవిత్ర పుష్కరిణిలో అభిషేకం, చక్రతీర్థం నిర్వహించారు. భక్తులు పుష్కర స్నానం ఆచరించి ముక్కోటి దేవతలకు శాస్త్రోక్తంగా పరిసమాప్తి వీడ్కోలు పలికారు.
ఆమెదే.. పైచేయి..
వనపర్తిటౌన్: పుర పాలకవర్గం ప్రతి వార్డులో ప్రాధాన్యత క్రమంలో ఐదు దశల్లో అభివృద్ధి పనులు చేపట్టేలా మార్గదర్శకాలు రూపొందించామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం పుర కౌన్సిల్ హాల్‌లో 55 మంది పారిశుద్ధ్య కార్మికులు, 52 మంది ఆర్పీలు, 20 మంది మహిళా కౌన్సిలర్ల సన్మాన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై వారిని సన్మానించి మాట్లాడారు. ప్రతి వార్డును సమగ్రంగా అధ్యాయనం చేసేందుకు రోజంతా తిరగాలని.. ముఖ్యమైన సమస్యలను తొలి విడతలో పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 33 శాతం రిజర్వేషన్లు చట్టసభల్లో అమలైతే అత్యధికంగా మహిళలే ప్రజాప్రతినిధులుగా రాణిస్తారని చెప్పారు. వనపర్తిలో నిజాం కాలంలోనే ఆసియాలోనే తొలి సైఫన్ సిస్టం, బస్‌డిపో, సెంట్రల్ లైటింగ్, తొలి ముద్రణాలయంతో పాటు అభివృద్ధికి దశల వారీగా అడుగులు పడుతూ వచ్చాయన్నారు. పారిశుద్ధ్య కార్మికులు వేతనం గురించి ఆలోచించకుండా ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారని, కార్మికుల హక్కుల సాధన, వారికి అన్నిరకాల బెనిఫిట్స్ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పురపాలికకు కౌన్సిల్ ఆమోదంతో 50 మంది కార్మికుల నియామకానికి చొరవ తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ ఎం. మాధవి, వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, కౌన్సిలర్లు ధనలక్ష్మి, విజయలక్ష్మి, సౌమ్య, మహేశ్వరి, నాగమ్మ, శిరీష, శారద, అరుణజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలర్లను గౌరవించాలి..
పుర అధికారులు, సిబ్బంది ప్రజలతో ఎన్నుకున్న కౌన్సిలర్లకు తగిన గౌరవం ఇవ్వాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి సూచించారు. శనివారం పుర కార్యాలయంలో చైర్‌పర్సన్ ఎం.మాధవి అధ్యక్షతన పుర అధికారులు, ఉద్యోగులు, సిబ్బందితో పాలకవర్గానికి పరిచయ కార్యక్రమం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కౌన్సిలర్లు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించాలని, వారి స్థాయిలో కాకుండా చైర్‌పర్సన్, అక్కడ కూడా కాకుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ మధుసూదన్‌గౌడ్, కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ యూనుస్, మేనేజర్ శంకర్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉమామహేశ్వర్‌రెడ్డి, ఏఈలు ప్రశాంత్, మేఘనాథ్, మెప్మా అధికారులు బాలరాజు, యువరాజు, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.
చైర్‌పర్సన్ మాధవి, మహిళా కౌన్సిలర్లను సన్మానిస్తున్న
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని నేటి మహిళలు నిరూపిస్తున్నారు. మహిళలు రాజకీయంగా మెరుగైన పాలన అందిస్తూ గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నించాలి. మహిళా ప్రజాప్రతినిధులు పాలనలో భర్తల ప్రమేయం లేకుండా స్వయం నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ సాధికారత సాధ్యం కావడంతో పాటు మహిళల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ మహిళా దినోత్సవం కంటే ముందు, తర్వాత చేసిన ప్రతి ఉద్యమంలో మహిళల పాత్ర ఎనలేనిది.
– ఎం.మాధవి,
మున్సిపల్ చైర్‌పర్సన్, వనపర్తి
స్థానిక మున్సిపాలిటీలో గతంలో మహిళా కౌన్సిలర్ల బదులు వారి భర్తలే అన్ని అంశాల్లో పెత్తనం చేస్తే తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశామని.. అలాంటి పరిస్థితులు పునరావృత్తం కానివ్వొద్దని కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకురాలు, 21వ వార్డు కౌన్సిలర్ పి.ధనలక్ష్మి ఎమ్మెల్యేను కోరారు. ఎవరేమనుకున్నా తనకు అభ్యంతరం లేదని, మహిళా సంఘాల ఆర్పీలు సైతం మహిళలే ఉండేలా చూడాలన్నారు. ఆమె వ్యాఖ్యలతో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు, మహిళా సంఘాల ఆర్పీలు, అధికారులు అవాక్కయ్యారు.
వనపర్తి: మహిళలకు ఆపదొస్తే తక్షణం ఏం చేయాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి..? ఇదికో ఈ నంబర్లను సంప్రదిస్తే చాలు కొండంత అండ దొరుకుతుంది. అధికారి యంత్రాంగం మీకు రక్షణ కవచంలా ఉంటుంది. మొదట డయల్ 100కు ఫోన్ చేయండి. తర్వాత షీటీమ్, భరోసా కేంద్రాలు, స్థానిక పోలీసులను సంప్రదించాలి.
మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్‌తో కౌన్సిలర్‌గా పోటీ చేసే అవకాశం కలిగింది. వార్డు ప్రజలు నాపై విశ్వాసం ఉంచి గెలిపించారు. వార్డును అభివృద్ధి చేద్దామనుకుంటే అదృష్టవశాత్తు చైర్‌పర్సన్‌గా అవకాశం దక్కింది. అమరచింతను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా. ఐదేళ్ల పాలనలో రాజకీయాలకు అతీతంగా మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో అన్నిరంగాల్లో ముందుకు తీసుకెళ్తా. – జింక సువర్ణ రవి, పుర చైర్‌పర్సన్, అమరచింత
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్నిరంగాల్లో రాణించాలి. బాగా చదివి ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయ రంగాల్లో తమ ప్రతిభ చాటాలి. ముందుంటేనే సమస్యలు సునాయసంగా పరిష్కారమవుతాయి. మంత్రి వాకిటి శ్రీహరి సహకారంతో, పాలకవర్గ సమన్వయంతో పురపాలికను అన్నింటా అభివృద్ధి చేస్తా.
– నాగమణి, పుర చైర్‌పర్సన్, ఆత్మకూర్
పాలనాధికారి పారిశుద్ధ్య కార్మికుడై..
కుటుంబం మద్దతుతోనే ముందుకు..
18 నుంచి 25 ఏళ్ల యువతుల మనోగతం
తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల ఆలోచన ధోరణుల్లో
మరింత మార్పు రావాలని ఆకాంక్ష


