10న మెగా జాబ్‌ డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

10న మెగా జాబ్‌ డ్రైవ్‌

Mar 9 2026 7:13 AM | Updated on Mar 9 2026 7:13 AM

వనపర్తిటౌన్‌: జిల్లాకేంద్రంలోని మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 10న ఉదయం 11 గంటలకు మెగా జాబ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా. ఈశ్వరయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఉపాధి అధికారి డా. ప్రియాంక ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్‌మేళాలో 13 కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసి 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులని, ఎంపికై న వారికి నెలకు రూ.14 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనాలు ఉంటాయన్నారు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement