కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కసరత్తు | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి కసరత్తు

Mar 7 2026 9:36 AM | Updated on Mar 7 2026 9:36 AM

వనపర్తి: కాంగ్రెస్‌పార్టీని బలోపేతం చేసేందుకు పోలింగ్‌ బూత్‌స్థాయి నుంచి కసరత్తు ప్రారంభించామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లోని డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతులకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ హాజరై దిశా నిర్దేశం చేశారని చెప్పారు. ఈ నెల 9 నుంచి ఏప్రిల్‌ 30 వరకు విడతల వారీగా జిల్లా, మండల, పట్టణ, గ్రామకమిటీలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. పుర, మండల కేంద్రాలకు వెళ్లి అందరి ఆమోదంతో కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. రానున్న కాలంలో బూత్‌స్థాయి కమిటీలు కీలకంగా పని చేస్తాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, తాను సైతం ఓటుహక్కు ఉన్న ప్రాంతాల్లోని బూత్‌ కమిటీలో సభ్యులుగా ఉండనున్నట్లు ప్రకటించారు. కమిటీల్లో ఉండదలుచుకున్న వారు అర్జీ చేసుకోవాలని సూచించారు. పార్టీ కోసం పూర్తిస్థాయిలో పని చేసేవారికి తొలి ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. రానున్న జనరల్‌ ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్‌ రాజీనామాను అప్పడే ఆమోదించామని.. ప్రస్తుతం ఆయనకు కాంగ్రెస్‌పార్టీకి ఎలాంటి సంబంధం డీసీసీ అధ్యక్షుడు స్పష్టతనిచ్చారు. పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎంతటి వారైనా ఉపేక్షించలేది లేదని హెచ్చరించారు. వనపర్తి, పెబ్బేరు మార్కెట్‌యార్డుల అధ్యక్షులు శ్రీనివాస్‌గౌడ్‌, ప్రమోదినిరెడ్డి, పుర చైర్‌పర్సన్‌ మాధవి రమేష్‌, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, పెబ్బేరు పుర చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement