వనపర్తి: జిల్లాకేంద్రానికి రానున్న 50 ఏళ్ల తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అమృత్ పథకం నిధులు రూ.71.71 కోట్లతో నీటిట్యాంకులు, పైప్‌లైన్ నిర్మాణాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. బుధవారం రాజనగరం శివారులో నీటిట్యాంకు నిర్మాణానికిగాను అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. నాగవరం శివారులో 5 లక్షలు, రాజనగరం శివారులో 6 లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకుల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. వెంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, పబ్లిక్ హెల్త్ డీఈఈ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు బ్రహ్మచారి, నాయకులు రమేష్, నక్కరాజు ఉన్నారు.


