వైభవంగా హనుమద్‌ వాహన సేవ | - | Sakshi
Sakshi News home page

వైభవంగా హనుమద్‌ వాహన సేవ

Mar 2 2026 8:55 AM | Updated on Mar 2 2026 8:55 AM

వైభవం

వైభవంగా హనుమద్‌ వాహన సేవ

వనపర్తి రూరల్‌: శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగనాథస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం యాగశాలలో శ్రీవారి మూలమంత్ర హవనం.. రాత్రి హనుమద్‌ వాహనసేవ, గోదాదేవి అమ్మవారి మండపోత్సవం నిర్వహించారు. దివ్యతేజ స్వరూపుడైన స్వామివారు మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ హనుమద్‌ వాహనంపై తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

వైభవంగా హనుమద్‌ వాహన సేవ 1
1/1

వైభవంగా హనుమద్‌ వాహన సేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement