మహావీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్
కొత్తకోట రూరల్: బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, శివాజీకి సమకాలీడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మండలంలోని సంకిరెడ్డిపల్లిలో రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్ సొంత డబ్బుతో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. ఆదివారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించి మాట్లాడారు. దోపిడీని అరికట్టడానికి 33 కోటలు, గోల్కొండను జయించిన మహా వీరుడని కొనియాడారు. ఆయన చరిత్రను తెలుగు రాష్ట్రాలకు విస్తరింపజేయాలని, కలిసికట్టుగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. గౌడ్‌లు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని, సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. అంతకుముందు యువత బైక్ ర్యాలీ, మహిళలు బతుకమ్మతో మాజీ మంత్రికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలరాజుగౌడ్, ఆయిల్ వెంకటన్నగౌడ్, వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, పెబ్బేరు మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, మధుగౌడ్, మాలపల్లి రామన్‌గౌడ్, గడ్డం తిరుపతన్నగౌడ్, శేఖర్‌గౌడ్, ఆనంద్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


