సమష్టి కృషితోనే మెరుగైన సేవలు
వనపర్తిటౌన్: ఉద్యోగులు సమష్టిగా కృషి చేసి ప్రయాణికులకు మెరుగైన సేవలందిస్తూ ఆర్టీసీ ఆదాయాన్ని మరింత పెంచాలని డిప్యూటీ రీజినల్ మేనేజర్ కవిత కోరారు. శనివారం జిల్లాకేంద్రంలోని డిపో ఆవరణలో నిర్వహించిన ఆదర్శ ఉద్యోగుల అభినందన సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై జనవరిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన కండక్టర్లు, డ్రైవర్లు, మెయింటెనెన్స్ సిబ్బందికి ప్రశంసా పత్రాలు, నగదు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉత్తమ ఉద్యోగులను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ దేవేందర్‌గౌడ్, ట్రాఫిక్, మెయింటెనెన్స్ సూపర్‌వైజర్లు, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు పాల్గొన్నారు.
అనుభవజ్ఞులు ఉద్యోగ విరమణ
పొందడం బాధాకరం..
అనుభవజ్ఞులైన ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందడం కొంత బాధాకరమని రీజనల్ డిప్యూటీ మేనేజర్ కవిత అన్నారు. శనివారం డిపో ఆవరణలో ఉద్యోగ విరమణ పొందిన రహీం, వీవీ మూర్తి, నీలయ్య, రాములును ఆమె సన్మానించి మాట్లాడారు. సంస్థను కన్న తల్లిలా భావించి అభివృద్ధికి కృషి చేసిన సేవలను ఆర్టీసీ ఎప్పటికీ మరువదన్నారు. డిపోలో పనిచేసిన ఉద్యోగులు సంస్థ కోసం అహర్నిశలు శ్రమించి మంచి పేరు తీసుకొచ్చారని డీఎం దేవేందర్‌గౌడ్ ప్రశంసించారు. కొల్లాపూర్ డిపో మేనేజర్ ఉమాశంకర్, గుండ్రాతి మధుగౌడ్, యూనియన్ నాయకులు, ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


