మత్తులో చిక్కుకుంటే జీవితాలు నాశనం
వనపర్తిటౌన్: మాదక ద్రవ్యాల వలయంలో చిక్కుకుంటే జీవితాలు నాశనం అవుతాయని జిల్లా అకాడమిక్ అధికారి మహానంది అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ప్రహరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థినులు తయారుచేసిన పోస్టర్లను ప్రదర్శించి మాట్లాడారు. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసవుతున్నారని, మత్తు ఆనందంగా మొదలై అలవాటుగా మారి వ్యసనంగా మారుతుందని తెలిపారు. వారి జీవితాలతో పాటు కుంటుంబాలను నాశనం చేసే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని.. జీవితాన్ని ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అనేదానిపై శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ మొబిలైజింగ్ అధికారి ప్రతాపరెడ్డి, ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవి, బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివాజీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన అదనపు కలెక్టర్
వనపర్తి: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఎన్.ఖీమ్యానాయక్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా అధికారులు ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజలకు మెరుగైన సేవ లు అందించే దిశగా స్థానిక సంస్థల పనితీరును మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత, వేగం, సమన్వయం ఉండేలా కృషి చేస్తానన్నారు.
మత్తులో చిక్కుకుంటే జీవితాలు నాశనం


