మద్దతు ధర ప్రకటించాలి..
మామిడి తోటల్లో 95 శాతం పూత రాలుతుండటంతో కొద్దిపాటి పంట మాత్రమే చేతికందే పరిస్థితి ఉంది. మామిడి విక్రయాలకు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి రావడంతో అదనపు ఆర్థిక భారం అవుతుంది. ప్రభుత్వం స్పందించి మామిడికి మద్దతు ధర ప్రకటించి ఆదుకోవాలి. – ఎత్తం బాలస్వామి,
మామిడి రైతు, వీపనగండ్ల
అధిక దిగుబడి కోసం రూ.లక్షలు వెచ్చించి అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమకు ప్రభుత్వం నష్ట పరిహారం అందజేసి ఆదుకోవాలి. పట్టాదారులకు చెల్లించిన డబ్బుతో పాటు పెట్టుబడులు, పురుగు మందులకు రూ.లక్షల్లో ఖర్చు చేశాం. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంటలు పరిశీలించి పరిహారం అందించాలి.
– చెనమోని గంగయ్య, కౌలురైతు, వీపనగండ్ల
వాతావరణంలో మార్పులతోనే మామిడి పూత రాలి దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. పురుగు మందుల కోసం రైతులు, కౌలు రైతులు అధిక మొత్తంలో వెచ్చించారు. పరిహారం చెల్లింపునకు ఉన్నతాధికారులు నివేదిక కోరితే అందజేస్తాం. అలాగే మామిడి కాయలతో తయారయ్యే ప్రత్యామ్నాయ ఉత్పత్తులపై రైతులు దృష్టి సారిస్తే అధిక లాభాలు పొందవచ్చు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పలు రకాల రాయితీలు అందజేస్తోంది. రైతులు కోరితే శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయిస్తాం.
– విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా ఉద్యాన అధికారి
●
మద్దతు ధర ప్రకటించాలి..


