సూర్యప్రభ వాహనంపై ఊరేగిన రంగనాథుడు | - | Sakshi
Sakshi News home page

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన రంగనాథుడు

Feb 28 2026 8:53 AM | Updated on Feb 28 2026 8:53 AM

సూర్య

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన రంగనాథుడు

వనపర్తి రూరల్‌: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామిని అందంగా ముస్తాబుచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీహరి మూలమంత్ర హవసం జరిగింది. రాత్రికి స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను సూర్యప్రభ వాహనంపై ఆసీనులను చేసి భక్తుల గోవింద నామస్మరణ నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. కార్యక్రమంలో అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, కన్నయ్య స్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన రంగనాథుడు 1
1/1

సూర్యప్రభ వాహనంపై ఊరేగిన రంగనాథుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement