కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం

Feb 27 2026 7:50 AM | Updated on Feb 27 2026 7:50 AM

కాంగ్

కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం

కొత్తకోట రూరల్‌: పేదల సొంతింటి కల సాకారం చేసిన ఘనత కాంగ్రెస్‌పార్టీకే దక్కిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని చర్లపల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి ఆయన హాజరై లబ్ధిదారుకు నూతన దుస్తులు అందజేసి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని.. గ్రామంలో ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం తొలివిడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసిందని.. సుమారు 70 శాతం ఇళ్ల్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఏప్రిల్‌లో రెండోవిడత ఇళ్లు మంజూరవుతాయని చెప్పారు. ఇల్లు రాలేదని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అర్హులందరికీ విడతల వారీగా మంజూరు చేస్తామని వివరించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పి.ప్రశాంత్‌, సర్పంచ్‌ శోభారాణి, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు శేఖర్‌రెడ్డి, పి.కృష్ణారెడ్డి, కౌన్సిలర్‌ ఎన్‌జే బోయేజ్‌, మేసీ్త్ర శ్రీనివాసులు, బీచుపల్లి యాదవ్‌, మాసన్న పాల్గొన్నారు.

వ్యవసాయ పరికరాలు పంపిణీ..

దరఖాస్తు చేసుకున్న ఐదుగురు రైతులకు రాయితీ వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అందజేశారు. మూడు రోటోవేటర్లు, రెండు కల్టివేటర్లు అందజేసినట్టు జిల్లా ఇన్‌చార్జ్‌ వ్యవసాయ అధికారి దామోదర్‌ తెలిపారు. రోటవేటర్‌కు రూ.5 వేలు, కల్టివేటర్‌రు రూ.30 వేల రాయితీ ఉందని.. అవసరం ఉన్న రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్తకోట ఏఓ జాస్మిన్‌, మదనాపురం ఏఓ గాయత్రి, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.

● మండలంలోని పామాపురం గ్రామంలో 20 మంది లబ్ధిదారులకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పట్టాలను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అంగన్‌వాడీ కేంద్రం, మహిళా సమాఖ్య భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ వినీత్‌, సర్పంచ్‌ అనురాధ, నాయకులు ఉమామహేశ్వర్‌రెడ్డి, రామచంద్రయ్యయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం 1
1/1

కాంగ్రెస్‌తోనే సొంతింటి కల సాకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement