143 మంది విద్యార్థులు గైర్హాజరు | - | Sakshi
Sakshi News home page

143 మంది విద్యార్థులు గైర్హాజరు

Feb 27 2026 7:50 AM | Updated on Feb 27 2026 7:50 AM

143 మ

143 మంది విద్యార్థులు గైర్హాజరు

వనపర్తిటౌన్‌: జిల్లాలో గురువారం ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెలుగు, హిందీ, ఉర్దూ, అరబిక్‌, సంస్కృతం, ఒకేషనల్‌ విద్యార్థులకు జనరల్‌ ఫౌండేషన్‌ (జీఎఫ్‌సీ) పరీక్షలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 25 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. 5,749 మంది విద్యార్థులకుగాను 5,606 మంది హాజరుకాగా, 143 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇందులో జనరల్‌ విద్యార్థులు 4,734 మందికిగాను, 4,619 మంది పరీక్ష రాయగా.. 115 మంది హాజరుకాలేదు. అదేవిధంగా ఒకేషనల్‌ విద్యార్థులు 1,015 మందికిగాను 987 మంది హాజరుకాగా.. 28 మంది గైర్హాజరయ్యారు. రాష్ట్ర పరిశీలకుడు నరేంద్రకుమార్‌ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, స్కాలర్స్‌, శ్రీసూర్య ఒకేషనల్‌, సీవీ రామన్‌, పానగల్‌లోని పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఏర్పాట్లు, పరీక్షల నిర్వహణను పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాకేంద్రంలోని జాగృతి కళాశాల పరీక్ష కేంద్రాన్ని డీఐఈఓ ఎర్ర అంజయ్య తనిఖీ చేశారు. విద్యార్థులను పూర్తిస్థాయిలో తనిఖీ చేసి కేందరంలోకి అనుమతించాలని సిబ్బందికి సూచించారు. స్క్వాడ్‌ బృందం పెబ్బేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, శ్రీరంగాపూర్‌, కొత్తకోట పరీక్ష కేంద్రాలను, డీఈసీ బృందం పెద్దమందడి, కొత్తకోట, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం పెబ్బేరు, సీవీ రామన్‌ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు.

143 మంది విద్యార్థులు గైర్హాజరు 1
1/1

143 మంది విద్యార్థులు గైర్హాజరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement