కాలయాపన సరికాదు..
ఎన్నికలు ముగిసినా రైతుభరోసా సాయం అందకపోవడం బాధాకరం. ఎకరాకు రూ.6 వేలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మౌనంగా ఉన్నారు. మళ్లీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే కోడ్ పేరుతో ఆపేస్తారేమోనని భయంగా ఉంది. సంబంధిత అధికారులను అడిగితే వస్తాయి అంటున్నారే తప్పా ఎప్పుడు వస్తాయో చెప్పడం లేదు. త్వరలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి.
– కృష్ణయాదవ్, గోవిందహళ్లి, మదనాపురం
రైతుభరోసాకు జిల్లాలో 1,75,800 మంది అర్హులైన రైతుల జాబితా సిద్ధంగా ఉంది. ఇందుకోసం సుమారు రూ.205.94 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. సాంకేతిక కారణాలు, ఎన్నికల కోడ్‌తో కొంత జాప్యం జరిగినప్పటికీ అర్హులైన ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందుతుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– దామోదర్‌గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి
కాలయాపన సరికాదు..


