28న జాతీయ లోక్ అదాలత్
వనపర్తిటౌన్: జిల్లా కోర్టు ఆవరణలో ఈ నెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నామని.. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. మంగళవారం జిల్లా కోర్టులో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లోక్ అదాలత్‌లో సివిల్, వివాహ సంబంధిత, మోటారు ప్రమాద క్లయిమ్స్, చెక్‌బౌన్స్ తదితర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్‌లో రాజీతో డబ్బు, సమయం ఆదా చేసుకోవచ్చని సూచించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసులకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు. ఎలాంటి కోర్టు ఫీజు చెల్లించనవసరం లేదని, దావా వేయడానికి చెల్లించిన ఫీజు కూడా తిరిగి ఇస్తామని వెల్లడించారు. అనంతరం హిట్ అండ్ రన్, పోక్సో, అండర్ ట్రయల్, కో–ఆర్డినేషన్, డిస్ట్రిక్ట్ కేసు మేనేజ్‌మెంట్ కమిటీలతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి.రజని, న్యాయమూర్తులు జి.కళార్చన, కె.కార్తీక్‌రెడ్డి, శ్రీలత, నోముల అశ్విని, శిరీష, డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు గోపాల్‌రెడ్డి, శ్రీనివాసాచారి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు రాజేష్, సునీత, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ బాలయ్య, కృష్ణయ్య, రఘు, శ్రీదేవి, సీడౠ్ల్యసీ వనజ, సఖి ఇన్‌చార్జ్ కవిత, జిల్లాలోని సబ్ ఇన్‌స్పెక్టర్లు, భరోసా కేంద్రం కౌన్సిలర్లు పాల్గొన్నారు.


