శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయంలో..
వనపర్తి రూరల్: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ప్రసిద్ధిగాంచిన శ్రీరంగాపురం రంగనాథస్వామి ఆలయానికి వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు తెల్లవారుజామున 4.30 గంటలకు వైకుంఠద్వారం దగ్గర ద్వార పూజ నిర్వహించి రంగనాయకస్వామి, గోదాదేవి ఉత్సవ విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకీపై ఉత్తరద్వారం దాటించారు. మహా విష్ణువు అవతారంలో స్వామివారు ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమిచ్చారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కుటుంబంతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.


