
విహారం.. కావొద్దు విషాదం
ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ప్రియదర్శిని జూరాల జలాశయం దిగువ పుష్కరఘాట్ వద్ద
నది సమీపంలోకి వెళ్లే మార్గాన్ని అధికారులు మూసి ఉంచినా.. పర్యాటకులు మాత్రం ఉధృతంగా పారుతున్న ప్రవాహం సమీపానికి వెళ్లి సెల్ఫీలకు ఫోజులివ్వడంతో పాటు జలకాలాడుతున్నారు. ఆదమరిస్తే ప్రమాదమని తెలిసినా.. ఎగిసి పడుతున్న వరద ముందు ఫొటోలు దిగుతున్నారు. గస్తీ నిర్వహిస్తున్నామంటున్న పోలీసులు వీటిని గమనించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. – అమరచింత

విహారం.. కావొద్దు విషాదం