
అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన అజెండా
● దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి
కొత్తకోట రూరల్: అన్నివర్గాల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన అజెండాగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పనుల జాతర’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో స్వయం ఉపాధి పనులకు సంబంధించి లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌లను అధికారులతో కలిసి ఆయన అందజేశారు. అనంతరం మండలంలోని నాటవెల్లిలో రూ.25 లక్షలతో నిర్మిస్తున్న యూపీఎస్ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్య, మౌలిక వసతులు, ఉపాధి రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. సంక్షే, అభివృద్ధి ఫలాలు అర్హులందరికీ చేరేలా కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నాయకులు పి.కృష్ణారెడ్డి, ఎన్‌జే బోయేజ్, రావుల కరుణాకర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్‌రెడ్డి, మేసీ్త్ర శ్రీనివాసులు, బీచుపల్లి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రాజా బహదూర్ వెంకట రామరెడ్డికి నివాళి..
రాజా బహదూర్ వెంకట రామరెడ్డి జయంతి సందర్భంగా రాయిణిపేట శివారులో ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మహనీయుడు, గొప్ప సంఘసంస్కర్త అయిన వెంకట రామరెడ్డి ఈ గడ్డపై జన్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో రెడ్డి సేవాసమితి సభ్యులు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.