
చేనేత ఉత్పత్తులను ఆదరిద్దాం
అమరచింత: చేనేత ఉత్పత్తులను ఆదరించి కళలను ప్రోత్సహిస్తూ కాపాడుకుందామని నాబార్డ్ డీడీఎం మనోహర్‌రెడ్డి కోరారు. బుధవారం పట్టణంలో చేనేత ఉత్పత్తిదారుల కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రూరల్ మార్ట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. నాబార్డ్ సహకారంతో నెలకొల్పిన ఈ మార్ట్‌లో చేనేత ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రెడీమేడ్ దుకాణాన్ని కంపెనీ డైరెక్టర్ పొబ్బతి వెంకటస్వామి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరచింత చేనేత ఉత్పత్తుల కంపెనీ ఐదేళ్లుగా నేత కార్మికుల భాగస్వామ్యంతో కొనసాగుతూ ఉత్పత్తులను తయారు చేస్తున్నారని వివరించారు. మగ్గాలపై నేసిన జరీ చీరలను ఇతర ప్రాంతాలతో పాటు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు కొత్తగా రూరల్ మార్ట్‌ను ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నాబార్డ్ అధికారులతో పాటు కంపెనీ సీఈఓ శేఖర్, డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.
నాబార్డ్ డీడీఎం మనోహర్