
అత్యవసర సమయాల్లో ఇబ్బందులు
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో పది రోజుల నుంచి హనుమాన్‌పురాలోని ఆర్‌యూబీ ద్వారా రాకపోకలు బంద్ అయ్యాయి. రైల్వే ట్రాక్ అవతల 2.5 కి.మీ. దూరంలో మా తండా ఉంటుంది. ప్రతి రోజూ బైక్‌ను ఇవతల ఉంచి న్యూటౌన్‌లో నేను పనిచేసే ప్రైవేట్ ఆస్పత్రికి వస్తున్నాను. తిరిగి రాత్రి రైల్వే ట్రాక్ వద్ద నిలిపి అవతలికి కాలినడకన వెళ్లి ఆ తర్వాత ఏదైనా ఆటో అందుబాటులో ఉంటే తండాకు చేరుకుంటున్నాను. అత్యవసర సమయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాత గేటును వెంటనే తెరిస్తే సమస్య కొంత వరకు పరిష్కారమవుతుంది. – పి.మహేష్, ప్రైవేట్ ఉద్యోగి, గొల్లబండతండా