
యూరియాకు పడిగాపులు
ఆత్మకూర్: యూరియా కోసం అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టణంలోని పీఏసీఎస్ వద్ద తెల్లవార్లు పడిగాపులు పడుతున్నారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు బుధవారం ఉదయం రాగా మధ్యాహ్నం 3.30కి 700 బస్తాలు రావడంతో ఒక్కసారిగా ఎగబడ్డారు. పోలీసులు కలుగజేసుకొని రైతులను వరుస క్రమంలో నిలబెట్టి సాయంత్రం వరకు పంపిణీ చేశారు. చాలామంది రైతులకు దొరకపోవడంతో నిరుత్సాహంతో వెనుదిరిగారు.
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని సింగిల్‌విండో కార్యాలయం వద్ద బుధవారం పోలీసుల గస్తీ నడుమ రైతులకు యూరియా పంపిణీ చేశారు. ఒక లారీ యూరియా వచ్చిందని తెలియడంతో రైతులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. విషయం తెలుసుకున్న ఎస్సై నరేష్ సిబ్బందితో అక్కడికి చేరుకొని రైతులను వరుసలో నిలబెట్టి టోకన్ ప్రకారం పంపారు. యూరియా తక్కువగా ఉండటంతో ఒక్కో రైతుకు కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇచ్చారు. అయినా సరిపోకపోవడంతో చేసేది లేక కార్యాలయ సిబ్బంది మిగిలిన రైతులకు టోకన్లు ఇచ్చి పంపారు. గురువారం ఉదయం వస్తుందని.. వచ్చి తీసుకెళ్లాలని చెప్పారు. ఏఓ మల్లయ్య పర్యవేక్షణ చేపట్టారు.
ఖిల్లాఘనపురం సింగిల్‌విండో వద్ద ఇలా..
అన్నదాతలకు తప్పని తిప్పలు
అందక నిరుత్సాహంతో వెనుదిరిగిన రైతులు

యూరియాకు పడిగాపులు