నిరుద్యోగులకు ఉపాధి | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు ఉపాధి

May 20 2025 12:54 AM | Updated on May 20 2025 12:54 AM

నిరుద్యోగులకు ఉపాధి

నిరుద్యోగులకు ఉపాధి

50 రోజుల పాటు శిక్షణ

నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు..

భూ వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి వ్యవసాయ క్షేత్రానికి హద్దులు నిర్ణయించే భూపటం (నక్ష) ఉండాలని ప్రభుత్వం నిర్ధేశించింది. ఈ మేరకు భూ భారతి చట్టం అమలులో నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. భూ వివాదాల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు ఉపాధి చూపించే దిశగా లైసెన్స్‌ కలిగిన సర్వేయర్ల నియామకానికి చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. శనివారం ఆర్ధరాత్రి వరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా వ్యాప్తంగా 1449 మంది దరఖాస్తు చేసుకున్నారు.

నిజాం పాలనలోని

సర్వే వివరాలే కోలమానం

జిల్లాలో నిజాం పాలనలో సేత్వార్‌ పేరిట 1938, 1945 మధ్యకాలంలో సర్వే నిర్వహించారు. అప్పట్లో రెవెన్యూ గ్రామాల వారీగా వాటాదారుల సమాచారంతో ఖస్రా పహాణీ తయారు చేసి అందుబాటులో ఉంచారు. ప్రభు త్వం ఏర్పడ్డాక వాటినే కొలమానంగా రెవెన్యూ శాఖ పరిగణిస్తూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఖస్రా పహాణీ ఆధారంగా భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం కొనసాగించింది. భూ హద్దులను గుర్తించేలా సర్వే చేయకపోవడంతో వివాదాలు అలాగే కొనసాగుతూ వస్తున్నాయి. వీటి శాశ్వత పరిష్కారం దిశగా భూ సర్వేకు ప్రభు త్వం ముందుకొచ్చింది. ప్రభుత్వ భూముల సర్వేకు ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నా ప్రైవేట్‌ వ్యక్తులకు భూ క్రయ విక్రయాల సమయంలో నక్ష సమర్పించాలనే నిబంధన పెట్టడంతో సర్వేయర్లకు ప్రాధాన్యం పెరిగింది.

‘భూ భారతి’లో భాగంగా క్షేత్రస్థాయి భూ సర్వేకు ప్రభుత్వం నిర్ణయం

భూ వివాదాలకు

శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అడుగులు..

లైసెన్సుడ్‌ సర్వేయర్‌

శిక్షణ పొందేందుకు

అర్హులకు అవకాశం

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 1,449 మంది దరఖాస్తులు

నారాయణపేట/నారాయణపేట రూరల్‌: భూ వివాద రహిత తెలంగాణగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చింది. దీనిని అమలు చేసేందుకు ఇప్పటికే పైలట్‌ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు సైతం చేపడుతున్నారు. వ్యవసాయ భూములకు కచ్చితమైన హద్దులు నిర్ణయించి భూ సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటోంది. నక్ష ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేయాలని నిర్ణయించడంతో ఆమేరకు అధికార యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. అయితే, ఉమ్మడి జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో అర్హులైన యువతకు శిక్షణ ఇచ్చి లైసెన్స్‌ సర్వేయర్‌ సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించి దరఖాస్తులు స్వీకరించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1449 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో.. ఓసీలు 54 మంది, బీసీలు 850, ఎస్సీలు 388, ఎస్టీలు 157 మంది అభ్యర్థులు ఉన్నా రు. ఈ దరఖాస్తులను సోమవారం నుంచి పరిశీలిస్తారని రెవెన్యూ అధికార యంత్రాంగం పేర్కొంది. ఈ వారంలోనే శిక్షణకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసి 50 రోజుల శిక్షణ అనంతరం జులై చివరి నాటికి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించింది. శిక్షణ పూర్తి అయితే వీరికి మెరుగైన ఉపాధి లభించనుంది.

జిల్లాల వారీగా దరఖాస్తుల వివరాలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement