వైకుంఠ ఏకాదశికి ముస్తాబు
విద్యుత్ దీపాల అలంకరణలో శ్రీరంగాపురం రంగనాయకస్వామి ఆలయం
వనపర్తి రూరల్: జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలు వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి పర్వదినానికి ముస్తాబయ్యాయి. వైష్ణవాలయాల్లో మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులకు ఉత్తరద్వార దర్శనాలు కల్పించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించడంతో పాటు ప్రత్యేకంగా క్యూలైన్లు ఏర్పాటుచేశారు. శ్రీరంగాపురం శ్రీరంగనాయక స్వామి ఆలయంలో తెల్లవారుజామున 4:30 గంటలకు ఉత్తర ద్వారం వద్ద ద్వారపూజ, స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని ఈఓ శేఖర్‌గౌడ్ తెలిపారు.
వైకుంఠ ఏకాదశికి ముస్తాబు


