‘పాలమూరు’ పనుల్లో కదలిక..
ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకోసం మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఈ ఏడాది ప్రాజెక్టు పనులను పరిశీలించారు. వచ్చే ఏడాది మార్చి కల్లా ప్రాజెక్టు కింద సాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా రైతులకు వరప్రదాయినిగా నిలిచే ఈ ప్రాజెక్టు పనుల్లో కదలికతో రైతుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఈ ప్రాజెక్టు కింద చేపట్టిన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉదండాపూర్ రిజర్వాయర్ల నిర్మాణంతోపాటు పూర్తిస్థాయిలో మోటార్ల బిగింపు పూర్తయితేనే సాగునీరు అందనుంది. అలాగే రిజర్వాయర్ల నుంచి ఆయకట్టు రైతులకు నీరందించేందుకు డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు, ఫీడర్ చానళ్ల నిర్మాణం చేపడితేనే రైతులకు మేలు చేకూరుతుంది.


