పోలీసు ప్రజావాణికి10 ఫిర్యాదులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై 10 ఫిర్యాదులు అందాయి. డీసీఆర్‌బీ డీఎస్పీ బాలాజీ నాయక్ ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజావాణి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆయన సూచించారు.
జాప్యం లేకుండాఅత్యవసర సేవలు
పాన్‌గల్: అత్యవసర సమయంలో 108 అంబులెన్స్ కోసం సంప్రదించే వారికి జాప్యం లేకుండా సేవలు అందించాలని 108 అంబులెన్స్‌ల ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ రవి సిబ్బందికి సూచించారు. సోమవారం పాన్‌గల్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో జీవీకేఎంఆర్‌ఐ 108 వాహనాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లోని వివిధ రకాల పరికరాలు, వాటి పనితీరు, మందులు, రికార్డులను పరిశీలించారు. 108 అంబులెన్స్ కోసం ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ప్రజలు అత్యవసర వైద్యం కోసం ఏ సమయంలోనైనా 108ను సంప్రదించవచ్చని.. తమ సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారన్నారు. ఆయన వెంట జిల్లా ఈఎంఈ మహబూబ్, అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ విష్ణు, పైలెట్ మురళి ఉన్నారు.
ప్రతి కూలీకి ‘ఉపాధి’ కల్పించాలి
అమరచింత: ఉపాధి హామీ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించడంలో అధికారుల అలసత్వం కారణంగానే అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని.. ఇప్పటికై నా బాధ్యతగా పనిచేయాలని డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. అమరచింత మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం జరిగిన ఉపాధి హమీ 4వ విడత సామాజిక తనిఖీ కార్యక్రమంలో ఆమె పాల్గొని గ్రామాల వారీగా చేపట్టిన పనులు, కూలీలకు డబ్బుల చెల్లింపులను పరిశీలించారు. మండలంలో రూ. 5.50కోట్లతో ఉపాధి హామీ పనులు చేపట్టారని.. ఏపీఓ రఘుపతిరెడ్డి తెలిపారు. వీటికి సంబంధించి డీఆర్‌పీలు సేకరించిన వివరాలను ఒక్కొక్క పంచాయతీ వారీగా వివరాలను వెల్లడించారు. అనంతరం డీఆర్డీఓ మాట్లాడుతూ.. గ్రామాల్లో పని కావా లని అడిగితే ప్రతి కూలీకి ఉపాధి హామీ పను లు కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. పనులు చేసిన కూలీలకు క్రమం తప్పకుండా కూలి డబ్బులు చెల్లించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో అధికారులు ఉపాధి హామీ పనులను పర్యవేక్షించాలని.. రోజు మస్టర్‌లో కూ లీల వివరాలు నమోదు చేయాలన్నారు. కాగా, పక్కదారి పట్టిన రూ. 15,010 రికవరీ చేయా లని ఏపీఓను ఆదేశించారు. సమావేశంలో అంబుర్స్‌మెంట్ సత్యనారాయణరెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎంపీఓ నర్సింహులు, ఏపీఓ రహీం, మల్లికార్జున, బాలరాజు పాల్గొన్నారు.
రామన్‌పాడులో 1,020 అడుగుల నీటిమట్టం
మదనాపురం: రామన్‌పాడు జలాశయంలో సోమవారం సముద్రమట్టానికి పైన 1,021 అడుగులకు గాను 1,020 అడుగులకు నీటిమట్టం వచ్చి చేరింది. జూరాల ఎడమ కాల్వ, సమాంతర కాల్వ ద్వారా వచ్చే నీటిని నిలిపివేశారు. రామన్‌పాడు నుంచి ఎన్టీఆర్ కాల్వకు 600, కుడి, ఎడమ కాల్వలకు 35, తాగునీటి అవసరాల కోసం 20 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు.
పోలీసు ప్రజావాణికి10 ఫిర్యాదులు
పోలీసు ప్రజావాణికి10 ఫిర్యాదులు


