మామిడి రైతు కుదేలు | - | Sakshi
Sakshi News home page

మామిడి రైతు కుదేలు

May 7 2025 12:26 AM | Updated on May 7 2025 12:26 AM

మామిడ

మామిడి రైతు కుదేలు

అకాల వర్షాలు, ఈదురు గాలులతో తీవ్రనష్టం

300 టన్నులకు పైగా..

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా ఏప్రిల్‌ నెలాఖరులో 300 టన్నులకు పైగా మామిడి కాయలు నేల రాలాయి. వీటిని విక్రయించేందుకు హైదరాబాద్‌ మార్కెట్‌కు తీసుకువచ్చారు. మార్కెట్లో రాలిన కాయలను తక్కువ ధరలకు రైతులు అమ్ముకున్నారు. ఇప్పుడు కూడా రోజూ రాలిన కాయలు మార్కెట్‌కు వస్తున్నాయి. వాతావరణ పరిస్థితుల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. దీనికి తోడు గాలివానల వల్ల రైతులు ఆర్థికంగా చాలా నష్టపోయారు. వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– సలీం, మామిడి

ఎక్స్‌పోర్ట్‌ కన్సల్టెంట్‌, కొల్లాపూర్‌

నష్టంపై నివేదికలిచ్చాం..

అకాల వర్షాలు, భారీ ఈదురుగాలుల కారణంగా మామిడి తోటల్లో పెద్దమొత్తంలో కాయలు రాలాయి. నియోజకవర్గాల వారీగా పంటనష్టంపై ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో చెట్లు విరిగిపడిన సంఘటనలు లేవు. కానీ, కాయలు చాలా రాలాయి. రాలిన కాయలను మార్కెట్లో ధరలు ఉండవు. ఈ విషయాన్ని కూడా ఉన్నతాధికారులకు తెలియజేశాం. – లక్ష్మణ్‌,

ఉద్యానవన శాఖ అధికారి, కొల్లాపూర్‌

కొల్లాపూర్‌: వాతావరణ ప్రభావంతో అంతంత మేరకే దిగుబడులు.. చేతికొచ్చిన దాన్ని అమ్ముకునే సమయానికి అకాల వర్షాలు, భారీ ఈదురుగాలులు మామిడి రైతులను కుదేలు చేశాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు లాభాలు రాకపోగా.. కష్టాలు.. నష్టాలు చుట్టుముట్టి రైతన్నల నడ్డి విరుస్తున్నాయి.

నామమాత్రపు దిగుబడులు

ఉమ్మడి జిల్లాలో ఈ సంవత్సరం మామిడి దిగుబడులు నామమాత్రంగానే ఉన్నాయి. మొదట్లో పూతలు బాగా పూసినప్పటికీ వాతావరణంలో మార్పులు, చీడపీడల కారణంగా ఆశించిన స్థాయిలో పంట దిగుబడులు రాలేదు. సాధారణ దిగుబడి కంటే సగం మేరకు తక్కువగా దిగుబడులు వచ్చాయి. పండిన ఆ కాస్త పంటను అమ్ముకునే సమయంలో మామిడి రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తోంది. ఏప్రిల్‌ నెల మూడో వారం నుంచి తరచూ వీస్తున్న భారీ ఈదురు గాలులు, అకాల వర్షాల కారణంగా జిల్లావ్యాప్తంగా మామిడి తోటలు దెబ్బతిని.. కాయలు పెద్దమొత్తంలో రాలిపోయాయి. కొన్నిచోట్ల చెట్లు సైతం నెలకొరిగాయి.

సరైన ధరలు లేక..

మామిడి దిగుబడుల సంగతి పక్కన పెడితే.. ధరలు ఈ ఏడాది కూడా పెరగలేదు. ఇందుకు వ్యాపారుల సిండికేటే ప్రధాన కారణం. ఫిబ్రవరి నెలలో టన్ను రూ.లక్షకు పైగా పలికిన మామిడి ధర.. మార్చి మొదటి వారంలో పూర్తిగా తగ్గిపోయాయి. టన్ను ధర రూ.40 వేల నుంచి రూ.70 వేలకు పడిపోయింది. ప్రస్తుతం రూ.30 వేల నుంచి రూ.50 వేలు మాత్రమే పలుకుతోంది. గాలివానల కారణంగా రాలిన మామిడి కాయలను హైదరాబాద్‌ మార్కెట్‌లో టన్నుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల లోపు కొనుగోలు చేస్తున్నారు. అంటే రైతులు పండించిన పంటకు రవాణా, కూలీ డబ్బులు కూడా రాని పరిస్థితి.

నష్టం అంచనాకు సాంకేతిక సమస్యలు

మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా బీభత్సం సృష్టించిన గాలులు

కల్వకుర్తి, బిజినేపల్లి ప్రాంతాల్లో నేలకొరిగిన చెట్లు

వాతావరణం అనుకూలించకపంట దిగుబడిపై ప్రభావం

ఆర్థికంగా చితికిన రైతులు.. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

మామిడి రైతు కుదేలు 1
1/2

మామిడి రైతు కుదేలు

మామిడి రైతు కుదేలు 2
2/2

మామిడి రైతు కుదేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement