నిధులు వచ్చేనా.. పనులు సాగేనా? | - | Sakshi
Sakshi News home page

నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?

Mar 19 2025 12:29 AM | Updated on Mar 19 2025 12:29 AM

నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?

నిధులు వచ్చేనా.. పనులు సాగేనా?

ఉమ్మడి జిల్లాలో అసంపూర్తిగా ప్రాజెక్టుల నిర్మాణాలు

కోయిల్‌సాగర్‌ కుడి, ఎడమ కాల్వల మరమ్మతు, డిస్ట్రిబ్యూటరీ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఇంకా సుమారు రూ.89.9 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల కింద నాగిరెడ్డిపల్లి పంప్‌హౌస్‌ వద్ద రూ.19.68 కోట్లు, తీలేరు పంప్‌హౌస్‌ వద్ద రూ.19.62 కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. కోయిల్‌సాగర్‌ బ్యాక్‌వాటర్‌ నుంచి తవ్విన దేవరకద్ర గ్రావిటీ కెనాల్‌ చౌదర్‌పల్లి నుంచి లక్ష్మిపల్లి వరకు రూ.21 కోట్ల విలువైన పనులు పెండింగ్‌ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాల్వల కింద, గ్రావిటీ కెనాల్‌ పరిధిలో, ఎడమ కాల్వ పొడిగింపు పనులకు గాను సేకరించిన భూములకు సంబంధించి ఇంకా 347 ఎకరాలకు పరిహారం చెల్లించాల్సి ఉంది.

గద్వాల: వలసలకు మారుపేరైన పాలమూరు వరుస మార్చాలనే తలంపుతో అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. ఐదేళ్ల పాలనలో దాదాపు పనులన్నీ 70– 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఆ తర్వాత వరుసగా చోటుచేసుకున్న రాజశేఖరరెడ్డి మరణం, వరదలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవి ర్భావం వంటి పరిణామాలతో ఆయా ప్రాజెక్టు పనుల గమనానికి అడ్డంకిగా మారాయి. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గడిచిన రెండు దశాబ్దాలుగా జలయజ్ఞం ప్రాజెక్టులు పెండింగ్‌లోనే కొనసాగుతున్న దుస్థితి. ఈ నేపథ్యంలో పాలమూరు వాసి అయిన సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వంపై పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల వరద పారి పంట పొలాలకు సాగునీరు అందుతుందనే అన్నదాతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పనులు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నారు.

కోయిల్‌సాగర్‌ది అదే దారి..

గత ప్రభుత్వ హయాంలో నిధుల కొరతతో ముందుకు సాగని వైనం

తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాపై కరుణ చూపేనా

పెండింగ్‌ పనులు పూర్తయితేనే పాలమూరు సస్యశ్యామలం

నేడు రాష్ట్ర బడ్జెట్‌ నేపథ్యంలో జిల్లా రైతాంగం ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement