కాగా ఆందోళన చేస్తున్న మహిళా సిబ్బంది తీవ్ర స్వరంతో అధికారులపై విరుచుకుపడ్డారు. ఈ సమయంలో పురుషులైతే బయటకు పోతారు కానీ మహిళా ఉద్యోగులమైన మేమెక్కడికి పోవాలి? పరిచయం లేని ప్రాంతంలో ఈ సమయంలో భోజనాలు ఎక్కడని వెతకాలి? ఎక్కడికి పోవాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం జరిగే ఎన్నికల కోసం వివిధ మండలాల నుంచి సుమారు 800 సిబ్బంది ఇక్కడ విధులు నిర్వహించేందుకు రాగా అందులో సుమారు 400 మంది ఎన్నికల ఉద్యోగులకు భోజనాలు లేవని వారంతా ఆందోళనకు దిగుతూ ఖాళీ ప్లేట్లను గాలిలో ప్రదర్శించారు.అక్కడ ఉన్న అన్నం, సాంబారు.కూర ఎంతమందికి సరిపోతుందో మీరే చూడడంటూ మీడియాకు చూపించారు.అలాగే కనీసం మంచినీరు ఇవ్వడం లేదని, వందల మందికి భోజనాలు ఏర్పాటు చేసే చోట కేవలం ఒక్క వాటర్ టిన్ పెట్టి చేతులు దులుపుకున్నారని వాపోయారు.


