రాజాంలో
రాజాం:
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం ఏరులైపారుతోంది. ఇదే ప్రధాన ఆదాయవనరుగా భావించి నెలనెలా మద్యం విక్రయాల పెంపునకు లక్ష్యాలు విధిస్తోంది. దీంతో చిన్నచిన్న దుకాణాల్లోనూ మద్యం దొరుకుతోంది. గంజాయి వంటి మత్తు పదార్థాల (గంజాయి) వినియోగం రాజాం వంటి ప్రశాంత పట్టణంలో పెరిగింది. యువత మద్యం, గంజాయికి బానిసలవుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మత్తులో యువత చేస్తున్న వికృతచేష్టలు, నేరాలను చూసి భయాందోళన చెందుతున్నారు. ఒకప్పుడు పారిశ్రామికీకరణ, ఉన్నత విద్యాసంస్థలకు కేరాఫ్‌గా ఉండే రాజాం ఇప్పుడు డాన్ కల్చర్‌తో కాకవికలంగా మారడం మేధావి వర్గాన్ని ఆందోళన కలిగిస్తోంది.
● శాంతిభద్రతలకు విఘాతం..
గత ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా లా అండ్ ఆర్డర్ పనిచేసేది. తప్పుచేసిన వ్యక్తిని చట్టబద్ధంగా శిక్షించేవారు. మద్యం బాటిల్లు దుకాణాల వద్ద ఒక వ్యక్తికి ఒకటికి మించి ఇచ్చేవారు కాదు. కఠినంగా తనిఖీలు ఉండేవి. ఒక్క మద్యంనే కాకుండా అక్రమ ఇసుక రవాణాను, గంజాయి విక్రయాలను నియంత్రిచేవారు. విజువల్ పోలీస్ వ్యవస్థతో ప్రధాన కూడలిలో పోలీసుల పహారా ఉండేది. దోపిడీలకు అవకాశం లేకుండా కార్డెన్‌సెర్చ్‌లు చేసేవారు. వీటికి తోడు గ్రామాల్లో, పాఠశాలల్లో, కళాశాలల్లో అవేర్‌నెస్ కార్యక్రమాలు ఉండేవి. ఉద్యోగాలు మెండుగా ఉండడం, సచివాలయ వ్యవస్థలు పనిచేయడంతో గ్రామాల్లోని ఉమెన్ పోలీసులు పక్కాగా సమాచారం ఇవ్వడంతో గొడవలు, దొంగతనాలు పూర్తిగా తగ్గాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. విజువల్ పోలీస్ వ్యవస్థలేదు. వీటికి తోడు అక్రమ మద్యం విక్రయాలు పెరిగాయి. వీటి ముసుగులో గంజాయి రవాణా పెరిగిపోయింది. డ్రంక్ డ్రైవ్ కేసులు తగ్గిపోవడంతో రాత్రి సమయాల్లో దొంగలు, రౌడీ షీటర్లు పెట్రేగిపోతున్నారు. సాధారణ ప్రజలు భయాందోళన చెందే పరిస్థితులు నెలకొన్నాయి. వీటి నుంచి బయటపడే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
రెండున్నరేళ్లుగా అశాంతి
వాతావరణం
పెరుగుతున్న గంజాయి వినియోగం
హత్యలు, దొంగతనాలతో ప్రజలు బెంబేలు
పెట్రేగిపోతున్న రౌడీషీటర్లు
అరెస్టులు చేసినా కేర్‌లెస్
రోడ్డెక్కుతున్న గంజాయి బ్యాచ్‌లు


