● ఏర్పాట్లు పూర్తి
విజయనగరం రూరల్: జిల్లా ప్రజా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌ల ఎన్నిక ప్రక్రియ స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించనున్నట్టు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. కొత్తగా ఎన్నికై న జెడ్పీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం మధ్యా హ్నం ఒంటి గంటకు జరుగుతుందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాలో జెడ్పీటీసీ సభ్యుల సంఖ్య 27 ఉండగా, నిబంధన ప్రకారం కోరం 14 మంది సభ్యులు ఉండాలన్నారు. సభ్యులు చేతులు పైకెత్తి ఓటు వేయడం ద్వారా ఎన్నిక జరుగుతుందని తెలిపారు.
ఆక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్
● పలు రైళ్లు రద్దు
● మరికొన్ని దారిమళ్లింపు
విజయనగరం టౌన్/విజయనగరం గంటస్తంభం: ఆక్వాన్ తుఫాన్ కారణంగా పలు రైళ్లు రద్దు, మరికొన్నింటిని దారిమళ్లింపు చేసినట్లు రైల్వే అధికారులు గురువారం తెలిపారు. రైలు నంబర్ 58506/05 విశాఖ–గుణుపూర్–విశాఖ, రైలు నంబర్ 67289/290 విశాఖ–పలాస–విశాఖ పాసింజర్లను రద్దుచేశారు. రైలు నంబర్ 20807 విశాఖ–అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ డైవర్షన్‌లో విజయనగరం–రాయగడ –టిట్లాఘర్ సంబల్ పూర్ మీదుగా వెళ్తుంది.
తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి
తుఫాన్ ప్రభావంతో జిల్లాలోని రాజాం, చీపురుపల్లి నియోజకవర్గాలతో పాటు మన్యం ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేఽశించారు. అధికారులతో గురువారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో తుఫాన్ పరిస్థితులపై సమీక్షించారు. గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం ఇప్పటికే జిల్లాకు చేరుకుందని తెలిపారు. జలాశయాలు 80 నుంచి 90 శాతం నిండిన నేపథ్యంలో నీటి మట్టాలు, ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతుమాధవన్, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, విపత్తుల నిర్వహణ అధికారి అంబరీష్, తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ నాయకుడి
బెదిరింపులపై ఆర్డీఓ విచారణ
● తన ఓటు హక్కును
హరించారు: బాధితుడు
బొబ్బిలిరూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చింతాడ గ్రామానికి చెందిన సన్యాసిరావు(జీవ)ను వార్డు సభ్యునిగా నామినేషన్ వేయకుండా స్థానిక టీడీపీ నాయకుడు బెదిరించిన అంశంపై ఆర్డీఓ జేవీవీ రామ్మోహనరావు గురువారం గ్రామంలో విచారణ జరిపారు. ‘నీ అంతుచూస్తా’ శీర్షికన ‘సాక్షి’ గురువారం ప్రచురితమైన వార్తకు ఉన్నతాధికారులు స్పందించారు. వీఆర్వో గౌరీశంకర్‌ను విచారణ జరిపారు. సదరు వ్యక్తి తమ వద్దకు రాలేదని, సమాచారం కూడా ఇవ్వలేదని వీఆర్వో చెప్పినట్లు చెప్పారు.
నా ఓటుహక్కును హరించారు
చింతాడ వార్డు సభ్యునిగా పోటీ చేసి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేయాలన్న తన ఆకాంక్షను కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా అధికార పార్టీ వారికి సమాచారం ఇచ్చిన వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని బాధితుడు సన్యాసిరావు(జీవ) డిమాండ్ చేశారు. రాజ్యాంగం తనకు ఇచ్చిన ఓటు హక్కును హరించిన వీఆర్వో, తనను భయబ్రాంతులకు గురిచేసిన వ్యక్తిౖపైపె చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ అంశంపై ఆర్డీఓ రామ్మోహనరావును వివరాలు కోరగా...జీవ అనే వ్యక్తికి బెదిరింపులపై గ్రామంలో ప్రాథమిక విచారణ జరిపామన్నారు. ఆ వ్యక్తి ఎవరో ఎవరికీ తెలియదని గ్రామస్తులు చెప్పా రని తెలిపారు. శుక్రవారం మరో మారు విచారణ జరుపుతామని వివరించారు.


