● మార్చి 3న ఉత్తరప్రదేశ్‌కు చెందిన దొంగలు గ్యాంగ్ రాజాంలో ఓ ఆటోలోని తెర్లాం మండలం సతివాడకు చెందిన ప్రయాణీకులు వద్ద ఆరు తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసారు. వీరిని పట్టుకునేందుకు పోలీసులకు తలనొప్పులు పట్టుకున్నాయి.
● రెండు నెలల కిందట రాజాంకు చెందిన ఓ వ్యక్తి మైనర్ యువత, చిన్నారులతో ఇన్‌స్ర్ట్రాగామ్ రీల్స్ చేయడం, ప్రజలను, మహిళలను బయపెట్టిన కేసులో ఓ వ్యక్తి అరెస్టు.
● జూలై 22న రాజాం మండలం చీకటిపేట కూడలి వద్ద ఓ స్కూల్ బ్యాగ్‌లో 4 కిలోల 41 గ్రాముల గంజాయి స్వాధీనం. అదేరోజు శ్యాంపురం తోటల్లో గంజాయి సేవిస్తూ నలుగురు యువకులను పట్టుకున్న పోలీసులు.
జూలై 25న రాజాంలో ఫైర్ స్టేషన్ సమీపంలో కంచరాం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులపై ఓ రౌడీ షీటర్ దాడి, రూ.1000లు నగదుతో పాటు ఓ మొబైల్ దోపిడీ. బాధితులపై దాడులు.
ఆగస్టు 3న అమరాం వద్ద ఘర్షణ, ఒక వ్యక్తి ఛాతిపై మరో వ్యక్తి ఇనుప గునపాంతో దాడి.
ఆగస్టు 13న రాజాం ఏరియా ఆస్పత్రి ఎదురుగా ఓ స్పోర్ట్స్ అండ్ గిఫ్ట్ షాప్ వద్ద రౌడీషీటర్ బెదిరింపు, 1300లు విలువచేసే క్యారెమ్ బోర్డు సెట్ దోపిడీ.
మే 21న సంతకవిటి మండలానికి చెందిన ఆరుగురు విద్యార్థులు గంజాయి సేవిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. వీరికి రామభద్రపురం ఏరియా నుంచి గంజాయి సరఫరా అయినట్లు తెలిసింది. ఈ విద్యార్థులు రాజాంలోనే చదువుతున్నారు.


