విజయనగరం రూరల్:
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడో విడత ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్ జారీ చేసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విడతలో జిల్లాలోని విజయనగరం, చీపురుపల్లి రెవెన్యూ డివిజన్లకు చెందిన 9 మండలాల్లో ఎన్నికలు జరుగుతాయని ఆయన తెలిపారు. భోగాపురం మండలం –22, డెంకాడ– 25, నెల్లిమర్ల–28, పూసపాటిరేగ –28, విజయనగరం మండలంలో –22, చీపురుపల్లి డివిజన్ పరిధిలోని మెరకముడిదాం–29, చీపురుపల్లి–19, గరివిడి–29, గుర్ల–42 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నవి.
● రెండో రోజు నామినేషన్లు ఇలా..
విజయనగరం రూరల్: జిల్లాలోని 10 మండలాల్లో నిర్వహించనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రెండో రోజు నామినేషన్ల జోరు కొనసాగింది. 10 మండలాల్లోని 308 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు తొలి రోజు 125 నామినేషన్లు దాఖలు కాగా, 2,854 వార్డు సభ్యుల స్థానాలకు 291 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే, రెండో రోజు సర్పంచ్ స్థానాలకు 394 నామినేషన్లు దాఖలు కాగా, వార్డు సభ్యుల స్థానాలకు 1887 నామినేషన్లు దాఖలయ్యాయి.
డిసెంబర్ 2న 9 మండలాల్లో
ఎన్నికలు
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
ఎస్.రాంసుందర్ రెడ్డి


