నేడు మూడో విడత పంచాయతీ పోరుకు షెడ్యూల్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

నేడు మూడో విడత పంచాయతీ పోరుకు షెడ్యూల్‌ విడుదల

Nov 19 2026 1:01 AM | Updated on Nov 19 2026 1:01 AM

విజయనగరం రూరల్‌: జిల్లాలో 773 గ్రామ పంచాయతీల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో షెడ్యూల్‌, నోటిఫికేషన్‌ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం మూడో విడత ఎన్నికకు సంబంధించి గురువారం షెడ్యూల్‌ జారీ చేయనుంది. తొలి విడతలో బొబ్బిలి డివిజన్‌ పరిధిలో బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల్లోని 110 గ్రామ పంచాయతీలకు, విజయనగరం డివిజన్‌ పరిధిలోని కొత్తవలస, లక్కవరపుకోట, వేపాడ, శృంగవరపుకోట మండలాల్లోని 111 గ్రామ పంచాయతీలకు ఈ నెల 15న నోటిఫికేషన్‌ జారీచేసి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేసింది. రెండో విడతలో విజయనగరం డివిజన్‌ పరిధిలో గంట్యాడ, జామి, బొండపల్లి మండలాల్లోని 89 గ్రామ పంచాయతీలకు, బొబ్బిలి డివిజన్‌ పరిధిలోని దత్తిరాజేరు, గజపతినగరం, మెంటాడ మండలాల్లోని 96 గ్రామ పంచాయతీలకు, చీపురుపల్లి డివిజన్‌ పరిధిలోని రేగిడి ఆమదాలవలస, వంగర, రాజాం, సంతకవిటి మండలాల్లోని 123 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణకు ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీ చేసింది. దీనికి సంబంధించి ఈ నెల 18 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మూడో దశలో జిల్లాలో మిగిలిఉన్న 9 మండలాల్లోని 244 గ్రామ పంచాయతీలకు గురువారం షెడ్యూల్‌ జారీ కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement