● తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న
విద్యార్థుల తల్లిదండ్రులు
లక్కవరపుకోట: గత ప్రభుత్వం నాడు–నేడు పథకంలో లక్షల కోట్లు ఖర్ఛు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించి రూపురేఖలనే మార్చేసింది. అనంతరం 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం విద్యను, పాఠశాలలను పూర్తిగా గాలికి వదిలేసి ప్రచార యావలోనే గడుపుతోంది. మండలంలోని సంతపేట ప్రాథమిక పాఠశాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. పాఠశాల రక్షణ గోడ శిథిలావస్థకు చేకుని కూలిపోయి ప్రమాదకరంగా ఉంది. దీంతో పశువులు పాఠశాలలోకి ప్రవేశించకుండా ఉండేందుకు రక్షణగా విద్యార్థుల సహాయంతో ఉపాధ్యాయులు చీరను అడ్డంగా కట్టారు. అయినప్పటికీ పాఠశాలలోకి పశువులు చొరబడి మొక్కలను తినేస్తున్నాయి. ఈ పాఠశాల నాడు–నేడు ఫేజ్ త్రీకి ఎంపికై ంది. ఇంతలో ఎన్నికలు రావడంతో పనులు ముందుకు సాగలేదు.అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చిన సుమారు 28 నెలల్లో ఒక్కటి అంటే ఒక్క పని పూర్తిచేయకపోవడం గమనార్హం. ఇప్పటికై నా పాలకులు స్పందించి పాఠశాలకు రక్షణ గోడ, గేటు ఏర్పాటు చేయాలని బోధనా సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


