మూడోసారి మోసపోయిన రాజాం జనసేన ఇన్‌చార్జ్‌ | - | Sakshi
Sakshi News home page

మూడోసారి మోసపోయిన రాజాం జనసేన ఇన్‌చార్జ్‌

Nov 16 2026 12:20 AM | Updated on Nov 16 2026 12:20 AM

జనసేన పార్టీ రాజాం ఇన్‌చార్జ్‌ పొగిరి సురేష్‌కుమార్‌ మూడోసారి జనసేన పార్టీ చేతిలో మోసపోయాడు. ఏడాది క్రితం రాజాం ఏఎమ్‌సీ చైర్మన్‌ పదవిని సురేష్‌కుమార్‌ భార్య కృష్ణవేణికి కేటాయించి పేరు ప్రకటించి, ప్రమాణస్వీకారం చేసే సమయంలో రద్దుచేసి, టీడీపీకి చెందిన గురవాన నారాయణరావు భార్య పార్వతికి అప్పగించారు. ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో పలుచోట్ల జనసేన పార్టీ కార్యకర్తలు ఎన్నికల బరిలో నిలిచారు. వారికి బీఫామ్‌ అందజేస్తామన్న సురేష్‌కుమార్‌ ఆ ఫామ్‌లు పార్టీ నుంచి అందజేయలేకపోయారు. చివరి నిమిషం వరకూ ఇదిగో ఇస్తాం..అదిగో ఇస్తాం అంటూ కాలయాపన చేసి, చివరికి సురేష్‌కుమార్‌కు ఇవ్వకుండా చేతులెత్తేశారు. దీంతో జనసేన పార్టీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులు పలుచోట్ల స్వతంత్రులుగా ఉండిపోయారు. జనసేన పార్టీ కోసం తన ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తికి సైతం వలంటరీ రిటైర్మెంట్‌ ఇవ్వడమే కాకుండా, పవన్‌ కల్యాణ్‌ బర్త్‌డే వేడుకలు, సామాజిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు చేసి, అప్పులతో పార్టీని నడిపే సురేష్‌కుమార్‌కు పార్టీ బీఫామ్‌ ఇచ్చే అవకాశం జనసేన ఇవ్వలేదు. ఇప్పుడు రాజాం మున్సిపాల్టీ చైర్మన్‌ సీటు జనసేన ఖాతాకు రాగా, ఈ అవకాశం సైతం సురేష్‌కు దక్కకుండా జనసేన పార్టీ ఎక్కడో వేరే చోట ఉండే టీడీపీ కుటుంబానికి చెందిన వ్యక్తికి కేటాయించడం జీర్ణించుకోలేని అంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement