విజయనగరం కల్చరల్(క్రైమ్): జిల్లా కేంద్రంలోని జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖాధికారి కార్యాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల వాల్‌పోస్టర్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మి శుక్రవారం ఆవిష్కరించారు. గురజాడ స్మారక జిల్లా గ్రంథాలయంలో శనివారం గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమవుతాయని, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు డి.రామకృష్ణ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అదితి గజపతిరాజు విచ్చేస్తారని, విశిష్ట అతిథులుగా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జేసీ సేతుమాధవన్, ఏపీ గ్రంథాలయ పరిషత్ సభ్యుడు రౌతు రామ్మూర్తినాయుడు, జిల్లా పౌరసంబంధాల అధికారి పి.గోవిందరాజులు, డీఈవో యు.మాణిక్యంనాయుడు పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో భాగంగా 14 ఏళ్లలోపు బాలబాలికలకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, లలిత సంగీతం, బుర్రకథ వంటి పోటీలతో పాటు క్విజ్ పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పోటీల్లో విజేతలకు 20వ తేదీన బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డీపీఆర్వో ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.


