ఐబాబోయ్‌..! | - | Sakshi
Sakshi News home page

ఐబాబోయ్‌..!

Nov 14 2026 12:17 AM | Updated on Nov 14 2026 12:17 AM

సుగర్‌ వ్యాధితో..

రాజాం సిటీ: మారుతున్న జీవనశైలికి అనుగుణంగా మన ఆరోగ్యంతోపాటు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చక్కెర వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధంలేకుండా చిన్నా పెద్ద అందరూ సుగర్‌ వ్యాధి బారిన పడుతున్నారు. చక్కెర వ్యాధి వల్ల దృష్టి కోల్పోతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. నొప్పి తెలియకుండా చూపుపై ప్రభావం పడుతూ మెల్లమెల్లగా దెబ్బతీస్తుంది. ప్రజలకు అవగాహనలేకపోవడంతో కంటి సమస్యలపై అశ్రద్ధ వహిస్తున్నారు. ఈ నెల 14న ప్రపంచ చక్కెర నివారణ దినోత్సవం సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలపై ఆప్థాలమిక్‌ అధికారి ఎస్‌.వసంతరావు ఇలా వివరించారు.

చక్కెర వ్యాధి నియంత్రణలో లేకపోవడం వల్ల కంటి వెనుకభాగంలోని రక్తనాళాలు బలహీనపడి రక్తాన్ని లీక్‌ చేస్తాయి. కొత్త రక్తనాళాలు ఏర్పడతాయి. దీనినే డయోబెటిస్‌ రెటినోపతి అంటారు. మొదట చూపు బాగానే ఉన్నా క్రమక్రమంగా మసకబారుతుంది. తర్వాత చదవడం, ముఖాలను గుర్తుపట్టడం కూడా కష్టమవుతుంది. చివరకు దృష్టిని పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. చక్కెర నియంత్రణలో లేకపోవడంవల్ల కేటరాక్ట్‌, గ్లకోమా (నీటి కాసులు), మాక్యులర్‌ డీజనరేషన్‌ వంటి ఇతర కంటి వ్యాధుల బారిన పడే ఆస్కారముంది. ఈ వ్యాధి నియంత్రణలో లేకపోయినా, నిర్లక్ష్యం చేసినా శాశ్వత అంధత్వం వస్తుంది.

కంటి ఆరోగ్యంపై ప్రత్యేక

శ్రద్ధ చూపాలి

మధుమేహం ఉన్నవారు కంటి పరీక్షలను నిర్లక్ష్యం చేయకూడదు. చూపులో ఎలాంటి మార్పులు కనిపించకపోయినా కంటి వైద్యనిపుణుల సలహా మేరకు కంటి వెనుక భాగమైన రెటీనాను పరీక్షించుకోవాలి. చక్కెర వ్యాధిగ్రస్తుల కంటి ముందు నల్లని చుక్కలు కనిపించినా, కంటిచూపు హఠాత్తుగా తగ్గినట్టు ఉన్నా, దృష్టిలో హెచ్చుతగ్గులు అనిపించినా వెంటనే రెటీనా వైద్యనిపుణులను సంప్రదించాలి. డయాబెటిక్‌ రెటినోపతిని ప్రారంభదశలో గుర్తిస్తే సరైన చికిత్స ద్వారా చూపును కాపాడుకునే అవకాశం ఉంది. అందువల్ల మధుమేహం ఉన్న ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఏడాదికి రెండు సార్లు సమగ్ర కంటి పరీక్షలు చేయించుకోవాలి.

– ఎస్‌.వసంతరావు, ఆప్థాలమిక్‌ అధికారి, రాజాం

చక్కెరను అదుపులో

ఉంచుకుంటే కళ్ల ఆరోగ్యం

ప్రజలకు కంటి ఆరోగ్యంపై

అవగాహన అవసరం

నేడు ప్రపంచ చక్కెర నివారణ దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement