వేపాడ: మండలంలోని రామస్వామిపేట గ్రామానికి చెందిన పత్రి రామయ్యమ్మ పదినెలల క్రితం ఇల్లు విడిచి వెల్లిపోవడంతో ఆమె ఆచూకీని వల్లంపూడి పోలీసులు కనిపెట్టారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వేపాడ మండలంలోని రామస్వామిపేట గ్రామానికి చెందిన పత్రి రామయ్యమ్మ 2025 డిసెంబర్ 24న ఇల్లు విడిచి వెళ్లిపోయినట్లు ఆమె కుమారుడు పత్రి రామునాయుడు 2025 డిసెబర్ 31న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నాటినుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులు చివరకు ఆమె రాయిపూర్‌లో ఉన్నట్లు గుర్తించి గురువారం వల్లంపూడి పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి కుమారుడు రామునాయుడికి అప్పగించారు.


