వృద్ధులకు ఉచిత నేత్ర శస్త్రచికిత్సలు | - | Sakshi
Sakshi News home page

వృద్ధులకు ఉచిత నేత్ర శస్త్రచికిత్సలు

Nov 13 2026 12:10 AM | Updated on Nov 13 2026 12:10 AM

● పార్వతీపురం, పాలకొండ ఆస్పత్రుల్లో వైద్యశిబిరాలు

పార్వతీపురం రూరల్‌: అంధులకు ఈ ప్రపంచాన్ని చూపించడమే లక్ష్యంగా వైద్య ఆరోగ్యశాఖ పనిచేస్తోందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ విజయలక్ష్మి అన్నారు. ఈ మేరకు దృష్టి లోపంతో బాధపడుతున్న వృద్ధులకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో గురువారం ఉచితంగా నేత్ర శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని పార్వతీపురం, పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక నేత్ర వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ శిబిరాల్లో కంటి పరీక్షలు నిర్వహించి, కేటరాక్ట్‌ (అంతరకుసుమం), టేరిజియం (కొయ్యకండ) సమస్యలున్న వారిని గుర్తించి ఆపరేషన్లు పూర్తి చేశారు. కంటి వైద్య నిపుణురాలు డాక్టర్‌ శ్యామల పర్యవేక్షణలో..పార్వతీపురంలో డాక్టర్లు వెంకటేష్‌, శ్రావణి, పాలకొండలో డాక్టర్‌ భరణిశ్రీ ఈ శస్త్రచికిత్సలు నిర్వహించారు. రోగులకు కళ్లజోళ్లు, మందులు అందజేసి డిశ్చార్జ్‌ చేసినట్లు అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ డాక్టర్‌ జగన్మోహన్‌, వైద్యాధికారి డాక్టర్‌ నగేష్‌ రెడ్డి తెలిపారు. రోగులకు వసతి, భోజన సదుపాయాలు ఉచితంగా కల్పించారు. ఇళ్లకు వెళ్తున్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలను ఆఫ్తాల్మిక్‌ అధికారులు కృష్ణారావు, లక్ష్మణరావు వివరించారు. ఉచితంగా ఆపరేషన్లు చేసి కంటిచూపు అందించడం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నర్సింగ్‌ విద్యార్థులు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement