3.5 ఎకరాల చెరుకుతోట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

3.5 ఎకరాల చెరుకుతోట దగ్ధం

Nov 13 2026 12:10 AM | Updated on Nov 13 2026 12:10 AM

● సుమారు రూ.3 లక్షల నష్టం

వీరఘట్టం: మండలంలోని నడుకూరు రెవెన్యూ పరిధిలో గల మండల పరిషత్‌ కార్యాలయం వెనుక ఉన్న లెంక దుర్గాప్రసాదరావు చెరుకు తోటలో గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ పొలం గుండా వెళ్తున్న 11 కేవీ విద్యుత్‌ వైర్లు గాలికి ఊగి రాపిడి జరగడం వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని రైతు భావిస్తున్నాడు. దట్టమైన పొగ రావడంతో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమీపంలో ఉన్న రైతులు గుర్తించారు.అప్పటికే పొలం మొత్తం మంటలు వ్యాపించి చెరుకు పంట కాలిపోయింది. ఈ ప్రమాద విషయాన్ని పాలకొండ అగ్నిమాపక కేంద్రానికి తెలియజేయడంతో వారు వచ్చి మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే సుమారు 3.5 ఎకరాల చెరుకు పంట పూర్తిగా కాలిపోయింది. ఈ విషయం తెలియడంతో ఆర్‌ఐ రవితేజ, వీఆర్‌ఓ ఎల్‌.ఫణిమాధవ్‌లు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితి పరిశీలించారు. ప్రస్తుతం చెరుకు ధరను బట్టి సుమారు రూ.3 లక్షల వరకు నష్టం ఉంటుందని అంచనా వేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement