ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేనా..! | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం మొద్దు నిద్ర వీడేనా..!

Nov 13 2026 12:10 AM | Updated on Nov 13 2026 12:10 AM

విజయనగరం ఫోర్ట్‌:

ఐసీడీఎస్‌లో సమస్యలు కొలువుదీరాయి. చాలా అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేవు. అద్దెభవనాలు, ఇరుకు గదుల్లో పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యాబోధన అందించేందుకు టీచర్లు అవస్థలు పడుతున్నారు. విద్యుత్‌ సదుపాయం, మరుగుదొడ్లు లేని భవనాల్లో కేంద్రాల నిర్వహణపై చిన్నారుల తల్లిదండ్రులు అసంృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఏళ్ల తరబడి అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

11 ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్టులు..

జిల్లాలో 11 ఐసీడీఎస్‌ ప్రాజెక్టు లున్నాయి. బాడంగి, భోగాపురం, బొబ్బిలి, చీపురుపల్లి, గజపతినగరం, గంట్యాడ, గరివిడి, రాజాం, ఎస్‌.కోట, వియ్యంపేట, విజయనగరం ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌లున్నాయి. వీటి పరిధిలో 2,501 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఇందులో 73 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు కాగా 2,428 మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు.

72,447 మంది లబ్ధిదారులు..

జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో 72,447 మంది లబ్ధిదారులున్నారు. ఇందులో గర్భిణులు 6,601 మంది, బాలింతలు 7,483 మంది ఉన్నారు. ఆరు నెలల్లోపు చిన్నారులు 6,927 మంది , ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల లోపు పిల్లలు 34,623 మంది ఉన్నారు. 3 నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 16,817 మంది ఉన్నారు.

సరుకులు చేరడంలో అలసత్వం..

చిన్నారులకు ప్రతిరోజూ భోజనంతో పాటు పాలు, గుడ్డు అందించాలి. అదేవిధంగా గర్భిణులు, బాలింతలకు కూడా నెలకు సరిపడా (టేక్‌ హోమ్‌ రేషన్‌ కింద) పాలు, గుడ్లు, బియ్యం, నూనె, కందిపప్పు, వేరుశనగ చెక్కీలు, రాగి పిండి, అటుకులు, బెల్లం అందిస్తారు. టీడీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సరుకులు సకాలంలో కేంద్రాలకు చేరడం లేదు. ఒక నెల కందిపప్పు ఆలస్యం అయితే మరొక నెల పాలు, ఇంకొక నెల గుడ్లు కేంద్రాలకు ఆలస్యంగా వస్తున్నాయని సిబ్బంది చెబుతున్నారు. ప్రతి నెలా ఒకటో తేదీకల్లా సరుకులు రావాల్సి ఉండగా నెలాఖరవుతున్నా సరుకులు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కేంద్రాల నిర్వహణకు నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు.

ఐసీడీఎస్‌లో సమస్యలే.. సమస్యలు..

పట్టించుకోని టీడీపీ సర్కార్‌

అద్దె భవనాల్లో కేంద్రాలు

అంగన్‌వాడీ సిబ్బందికి ఇచ్చిన

హామీలు గాలికి..

సక్రమంగా పంపిణీ కాని సరుకులు

ఏళ్ల తరబడి అద్దె భవనాల్లోనే..

జిల్లాలోని పలు అంగన్‌వాడీ కేంద్రాలను సంవత్సరాల తరబడి అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. 801 కేంద్రాలు నేటికీ అద్దె కొంపల్లోనే నడుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ. 2 వేలు.. పట్టణ ప్రాంతాల్లో ఆరు వేల రూపాయల చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ. 2.88 కోట్ల వరకు ప్రజాధనం ఖర్చవుతోంది. అలాగే 490 కేంద్రాలు సామాజిక భవనాల్లో నడుస్తున్నాయి.

సిబ్బందికి ఝులక్‌..

అధికారంలోకి వస్తే అంగన్‌వాడీ సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తామని, వారికి జీతాలు పెంచుతామని చంద్రబాబు సర్కార్‌ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా అంగన్‌వాడీల సమస్యలు పరిష్కంచలేదు. ఒక్క పైసా జీతం పెంచిందీ లేదు. దీంతో ప్రభుత్వం తీరుపై సిబ్బంది మండిపడుతున్నారు. ప్రభుత్వం తీరుతో ఐసీడీఎస్‌ వ్యవస్థ నీరుగారిపోతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement