● కలెక్టర్లు, ఎస్పీలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్‌చంద్ర పూనేఠా ఆదేశాలు
విజయనగరం గంటస్తంభం: పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పూనేఠా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను వీడియో కాన్ఫరెన్స్‌లో గురువారం ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు, బ్యాలెట్లు, సిబ్బంది తరలింపు, కౌంటింగ్, తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో పరోక్ష ఎన్నికలను ఈనెల 23న నిర్వహించాలని ఆదేశించారు. ఎంపీపీ ఎన్నికలను ఈ నెల 19న, జెడ్పీటీసీ చైర్మన్ ఎన్నికను ఈ నెల 21న నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, డీఆర్వో సీహెచ్ సత్తిబాబు, జెడ్పీ సీఈఓ కిరణ్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి మల్లిఖార్జునరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటరాజు, కలెక్టరేట్ పరిపాలనాధికారి దేవీప్రసాద్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


