విజయనగరం అర్బన్: మహారాజా అటానమస్ కళాశాల ఎన్ఎస్ఎస్ వలంటీర్ గంటా హరీష్ వెస్ట్ జోన్ ఎన్ఎస్ఎస్ ప్రీ–రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్–2026కు ఎంపికయ్యారు. నవంబర్ 10 నుంచి 19వ తేదీ వరకు హైదరాబాద్లోని అనురాగ్ విశ్వవిద్యాలయంలో ఈ శిక్షణ శిబిరం జరగనుంది. ఈ శిబిరంలో ప్రతిభ కనబరిచిన వలంటీర్లకు 2027 జనవరి 1 నుంచ 31వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ ఎన్ఎస్ఎస్ రిపబ్లిక్ డే పరేడ్ శిబిరంలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. హరీష్ ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు హర్హం వ్యక్తం చేసి అభినందించారు.


